మా అమ్మాయి అతనితో డేటింగ్ చేస్తున్నమాట నిజమే
హార్రీ పోట్టర్ సినిమాల ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు స్టార్ హీరో డేనియల్ రాడ్ క్లిప్. ఐతే ఇటీవల కాలంలో డేనియల్ రాడ్ క్లిప్ వార్తల్లో బాగా నిలుస్తున్నారు. అందుకు కారణం డేనియల్ రాడ్ క్లిప్ సీక్రెట్‌గా ఓ అమ్మాయితో డేటింగ్ వ్యవహారం నడపడమే. 22 సంవత్సరాల వయసు కలిగిన డేనియల్ రాడ్ క్లిప్ న్యూయార్క్ నగరంలో తన పాట్నర్ యొక్క చేయి పట్టుకోని వీధుల్లో సంచరిస్తూ కెమెరాకి చిక్కడం జరిగింది. ఈ విషయంపై డేనియల్ రాడ్ క్లిప్‌ని స్పందించమని అడడగా నిరాకరించారు. అంతేకాకుండా తను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ప్రియురాలి పేరుని కూడా బయటకు వెల్లడించలేదు.
డేనియల్ రాడ్ క్లిప్ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఆమె పేరు రోసన్నా గోకర్ అని స్వయంగా ఆమె తండ్రి చెప్పడం విశేషం. డేనియల్ రాడ్ క్లిప్ ప్రస్తుతం నటిస్తున్న మ్యూజికల్ ఆల్బమ్ “How to Succeed in Business Without Really Trying"కు ప్రోడక్షన్ అసిస్టెంట్‌గా తన కూతురు వ్యవహారిస్తుందని తెలిపాడు. ఇంతకు మంచి నేను ఎక్కువగా మీకు తెలియజేయడం మంచిది కాదని తెలిపాడు. అసలు వారిద్దరూ డేటింగ్ చేసుకుంటున్న విషయాన్ని ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారో నాకు అర్దం కావడం లేదని తెలియజేశారు.
ఇక రోసన్నా గోకర్ విషయానికి వస్తే డేనియేల్ రాడ్ క్లిఫ్ హీరోగా నటించిన హారీ పోట్టర్ మూడు సినిమాలకు పనిచేయడం జరిగింది. చాలా సంవత్సరాలుగా వీరిద్దరికి పరిచయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క సంవత్సరం నుండి మాత్రమే విరివిగా వీరు బయటకు వెల్లడం ప్రారంభించారని రోసన్నా గోకర్ తండ్రి తెలిపారు. నేను డేనియల్ రాడ్ క్లిప్ ని కలవడం జరిగింది. అతను చాలా మంచివాడు. అతనితో రోసన్నా కలిసుండే చాలా సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం అని అన్నారు.


Click it and Unblock the Notifications











