క్రేజీ పార్టీ లైఫ్ స్టయిలంటే నాకు చాలా ఇష్టం

By Nageswara Rao

హాలీవుడ్ సూపర్ హీరో డానియల్ రాడ్క్లిఫ్ తనకి ఎల్లప్పుడూ కూడా క్రేజీ పార్టీ లైఫ్ స్టయిల్ అంటే చాలా ఇష్టమని అంటున్నారు. 21 సంవత్సరాల వయసు కలిగిన ఈ సూపర్ హీరో గత నూతన సంవత్సర వేడుకల్లో జీవితం బోర్‌గా అనిపిస్తుందని తనకి ఏదైనా కొత్తగా ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఈ సందర్బంలో డానియల్ రాడ్క్లిఫ్ మాట్లాడుతూ నా శరీరంలో లోపల ఉన్న జీవితం చాలా బోర్‌గా ఉందని అన్నారు. నా జీవితంలో పని చేసిన గ్రేట్ యాక్టర్స్ రిచర్డ్ హార్రిస్, గేరీ ఓల్డ్ మ్యాన్ వారియొక్క యవ్వన దశలో జీవితాన్ని ఎంతలా ఎంజాయ్ చేశారో వారితో కలసి పని చేసేటప్పుడు నాకు తెలిసింది. నాకు కూడా ఇప్పడు అలాంటి జీవితం కావాలని అనిపిస్తుందని అన్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే హార్రీ పోట్టర్ సినిమాల ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు స్టార్ హీరో డేనియల్ రాడ్ క్లిప్. ఐతే ఇటీవల కాలంలో డేనియల్ రాడ్ క్లిప్ వార్తల్లో బాగా నిలుస్తున్నారు. అందుకు కారణం డేనియల్ రాడ్ క్లిప్ సీక్రెట్‌గా ఓ అమ్మాయితో డేటింగ్ వ్యవహారం నడపడమే. 22 సంవత్సరాల వయసు కలిగిన డేనియల్ రాడ్ క్లిప్ న్యూయార్క్ నగరంలో తన పాట్నర్ యొక్క చేయి పట్టుకోని వీధుల్లో సంచరిస్తూ కెమెరాకి చిక్కడం జరిగింది. ఈ విషయంపై డేనియల్ రాడ్ క్లిప్‌ని స్పందించమని అడడగా నిరాకరించారు. అంతేకాకుండా తను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ప్రియురాలి పేరుని కూడా బయటకు వెల్లడించలేదు.

డేనియల్ రాడ్ క్లిప్ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఆమె పేరు రోసన్నా గోకర్ అని స్వయంగా ఆమె తండ్రి చెప్పడం విశేషం. డేనియల్ రాడ్ క్లిప్ ప్రస్తుతం నటిస్తున్న మ్యూజికల్ ఆల్బమ్ “How to Succeed in Business Without Really Trying"కు ప్రోడక్షన్ అసిస్టెంట్‌గా తన కూతురు వ్యవహారిస్తుందని తెలిపాడు. ఇంతకు మంచి నేను ఎక్కువగా మీకు తెలియజేయడం మంచిది కాదని తెలిపాడు. అసలు వారిద్దరూ డేటింగ్ చేసుకుంటున్న విషయాన్ని ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారో నాకు అర్దం కావడం లేదని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X