twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంపర్ ఛాన్స్ కొట్టేసిన బాలయ్య హీరోయిన్, మిషన్ ఇంపాజబుల్ స్టార్‌తో...

    |

    తెలుగులో బాలయ్యతో నటించిన సినిమాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్ రాధిక ఆప్టే... బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. తాజాగా రాధిక బంపర్ ఛాన్స్ కొట్టేసింది. మిషన్ ఇంపాజబుల్ నటుడు రిచర్డ్ రాక్స్బర్గ్‌తో కలిసి ఆమె నటించబోతోంది.

    హాలీవుడ్ పత్రిక డెడ్‌లైన్ కథనం ప్రకారం... 'శాంతారామ్' పేరుతో రాబోయే డ్రామా సిరీస్‌లో రిచర్డ్ రాక్స్బర్గ్‌, రాధిక ఆప్టే కలిసి నటించబోతున్నారట. గ్రెగొరీ డేవిడ్ రాబర్ట్స్ నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.

    Radhika Apte and actor Richard Roxburgh to star in Shantaram

    ఆస్ట్రేలియా జైలు నుండి తప్పించుకుని ముంబై వచ్చిన వ్యక్తి కథతో డ్రామా సాగుతుంది. కుటుంబం, స్నేహితులకు దూరమైన అతను ముంబైలోని మురికివాడలు, బార్లు, అండర్ వరల్డ్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.

    రోక్స్బర్గ్ డిటెక్టివ్ సార్జెంట్ మార్టి నైటింగాలెం పాత్రను పోషిస్తున్నాడు, అతను ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు పనిచేస్తుంటాడు, తప్పించుకున్న దోషులను వెంబడించడం, పట్టుకోవడం కోసం శిక్షణ పొందిన ఎలైట్ యూనిట్లో అతడు ఒక భాగం. ఇందులో రాధిక ఆప్టే.. కవిత అనే భారతీయ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తుంది. జస్టిన్ కుర్జెల్ 10-ఎపిసోడ్ సిరీస్‌లు గల మొదటి రెండు ఇన్‌స్టాల్మెంట్లకు దర్శకత్వం వహించనున్నారు.

    English summary
    Radhika Apte is all set to star alongside Moulin Rouge! actor Richard Roxburgh in Apple's upcoming drama series Shantaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X