ఇక్కడైతే బిచ్చం అడుక్కోవాలి.. కష్టానికి విలువలేదు: రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు
Recommended Video
విలక్షణ నటి రాధిక ఆప్టే తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కింది. హాలీవుడ్ చిత్రం లిబెర్టే: ఏ కాల్ టు స్పై అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కే ఈ చిత్రంలో రాధికా ఆప్టే బ్రిటీష్ గూఢచారి నూర్ ఇన్యత్ ఖాన్ అలియాస్ నోరా బేకర్ అనే పాత్రలో కనిపించనున్నది. ఈ సినిమాలోని పాత్ర గురించి ఇటీవల బాలీవుడ్ మీడియాకు వివరణ ఇచ్చారు. తాను నాజీల వశంలో ఉన్న ఫ్రాన్స్‌లో పారాచూట్‌లో వైర్‌లెస్ ఆపరేటర్‌గా కనిపించబోతున్నట్టు వెల్లడించింది. తన హాలీవుడ్ ఎంట్రీ గురించి ఏం చెప్పారంటే..

హాలీవుడ్ చిత్రం కోసమే
హాలీవుడ్ చిత్రంలోని నూర్ ఇన్యత్ పాత్ర కోసం చాలా రోజులుగా పరిశోధన, రిహార్సల్ పనిలో నిమగ్నమయ్యాను. ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయేందుకు ప్రిపేర్ అవుతున్నాను. ఆ పాత్రకు సంబంధించిన నాలెడ్జ్‌ను సంపాదిస్తున్నాను. నూర్ పాత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాను అని రాధిక ఆప్టే చెప్పారు. దాంతో ఆ పాత్రపై విపరీతమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు.

గూఢఛారి పాత్రలో రాధిక
గూఢఛారి నూర్ ఇన్యత్ పాత్ర గురించి చాలా నవలలు చదివాను. ఆ పాత్రలో ప్రవేశించడానికి ఎక్కువగా గుఢచారి సినిమాలు చూశాను. ఆ పాత్రకు సంబంధించిన హావభావాలను అలవాటు చేసుకొన్నాను అని రాధిక ఆప్టే వెల్లడించారు. అలాగే సినిమాకు సంబంధించిన రచయితలు, నిర్మాతలు, ఇతరులు చాలా సమాచారాన్ని అందించారన్నారు.

హాలీవుడ్, బాలీవుడ్‌కు తేడా ఏంటంటే
హలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు సంబంధించినంత వరకు చాలా వ్యత్యాసాలు కనిపించాయి. ప్రతీ డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్‌కు ప్రత్యేకమైన పద్దతి, శైలి ఉంటుంది. హాలీవుడ్ సినిమా పరిశ్రమలో సమయానికి రావడమనే మంచి లక్షణంగా కనిపించింది. సమయపాలన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చేసిన శ్రమకు చేయి చాపి బిచ్చం అడుక్కొనే పరిస్థితి కనిపించదు అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.

ఇష్టమైన బుడాపెస్ట్‌లో షూటింగ్
ప్రస్తుతం తనకు ఇష్టమైన బుడాపెస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. గతంలో ఈ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం బుడాపెస్ట్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఇంగ్లాండ్ వాతావరణాన్ని సృష్టించారు. బుడాపెస్ట్, ఫిలడెల్ఫియాలో ఈ సినిమాను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











