Ram Charan కు హాలీవుడ్‌లో భారీ ఆఫర్.. టామ్ క్రూయిజ్‌తో మూవీ..
RRR మూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఇక నాటు నాటు పాటతో వరల్డ్ వైడ్ అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు రాంచరణ్ ఇండియన్ యాక్టర్ మాత్రమే కాదు.. పాన్ వరల్డ్ స్టార్‌గా అవతరించారు. RRR సినిమా తర్వాత హాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు రావడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ ఆఫర్ గురించి రాంచరణ్ ఏమన్నారంటే?

నేరుగా ఢిల్లీకి రాంచరణ్
అమెరికాలో లాస్ ఎంజెలెస్‌లో ఆస్కార్ వేడుకలు, సంబరాలు ముగిసిన తర్వాత రాంచరణ్ నేరుగా ఢిల్లీకి చేరుకొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రధాని మోదీతో కలిసి వేదికను షేర్ చేసుకొన్నారు. ఈ వేడుకలో రాంచరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ తో వేదికను పంచుకొన్నారు.

హాలీవుడ్ ఆఫర్ నిజమేనా?
మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేస్తూ.. మేము వెబ్ మీడియాలో మీకు ఆఫర్ వచ్చిందని విన్నాం. దాని గురించి మీరు చెబుతారా? అని అడిగితే.. ఇంకా ఏమీ తెలియదు. లాస్ ఎంజెలెస్ నుంచి వచ్చాను. కానీ అలాంటి ఆఫర్‌తో రాలేదు. అయితే అలాంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏది కన్ఫర్మ్ కాలేదు అని రాంచరణ్ తెలిపారు.
ప్రాజెక్ట్ ఓకే అయిందా?
అయితే మీరు హాలీవుడ్ సినిమా కోసం సంతకం చేశారా? ప్రాసెస్‌లో ఉందా? అని రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగితే.. ఇంకా ప్రాసెస్‌లో ఉంది. కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్రాసెస్‌లోనే ఉంటుంది. కానీ మీరు అనుకొన్న కోరిక త్వరలోనే నిజమౌతుంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అని రాంచరణ్ అన్నారు. దాంతో సౌత్ వాళ్లు చాలా విషయాలు దాచిపెట్టి.. బ్రేకింగ్ ఇస్తారు.. అదే వారి సీక్రెట్ అని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు.

టామ్ క్రూయిజ్‌తో మూవీ
టామ్ క్రూయిజ్‌తో మావెరిక్ 3 చిత్రంలో రాంచరణ్ నటిస్తున్నాడా? అంటే.. ఇప్పడే ఏమీ చెప్పలేను. కానీ అలాంటి ఆఫర్ రావాలని ఎవరు కోరుకోరు. మా అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేది.. ఎవరి దృష్టిలో పడకూడదు. ఎవరి నజర్ నీ మీద పడకూడదని చెబుతుంటుంది. ఏదైనా అలాంటి జరిగితే మీకే ముందు చెబుతాను అని రాంచరణ్ అన్నాడు.

నేను డైరెక్టర్ యాక్టర్‌నా?
గత 15 ఏళ్లలో నీలో ఎలాంటి మార్పులు జరిగాయి అని రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. నేను ఫిలిం ఫ్యామిలీ వచ్చాను. గత కొన్నేళ్లుగా నా కెరీర్ పరంగా నేను చాలా మాట్లాడాను. రాజమౌళితో పనిచేసిన తర్వాత.. నా నేను డైరెక్టర్ యాక్టర్‌గా మారాను. నేను దర్శకుల విజన్‌ను గుర్తిస్తున్నాను అని రాంచరణ్ అన్నారు.

హైదరాబాద్‌లో ఘన స్వాగతం
అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకొన్న రాంచరణ్.. అమిత్ షాను కలుసుకొన్నారు. ఆ తర్వాత ఇండియా టుడే సదస్సులో పాల్గొన్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి రాంచరణ్ హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌లో రాంచరణ్‌కు భారీ స్వాగతం లభించింది. భారీగా అభిమానులు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు.


Click it and Unblock the Notifications











