twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి టెర్రరిస్టుగా చేయనని చెప్పా: జేమ్స్ బాండ్ మూవీ విలన్

    |

    ఇందులో రామి మాలెక్ టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఈజిప్ట్ మూలాలు ఉన్న రామి మాలెక్ ఈ పాత్ర ఒప్పుకునే ముందు ఓ కండీషన్ పెట్టాడట. తన పాత్ర మతానికి సంబంధించి భావజాలంతో ఉంటే తాను చేయడానికి సిద్ధంగా లేనని తెలిపారట. ఈ పాత్రలో అలాంటి షేడ్స్ ఏమీ లేవని దర్శకుడు క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు సైన్ చేశారట.

    ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖారారు కావాల్సి ఉంది. కారీ ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్నారు. డేనియల్ క్రెయిగ్, రామి మాలెక్‌తో పాటు బాండ్ సుపీరియర్ ఆఫీసర్, ఎంఐ6 హెడ్ 'ఎం' పాత్రలో రాల్ఫ్ ఫీనెస్, నామి హారిస్, రోరే కిన్నియర్, లెయా సెడౌక్స్, బెన్ విషా, జెఫ్రీ రైట్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    Rami Malek about Bond 25 villain role

    బాండ్ సీరిస్‌లో వస్తున్న 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలను మించిన బడ్జెట్ ఈ మూవీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఊహకు అందని అద్భుతమైన స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే విధంగా ఉండబోతున్నాయట.

    ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ ప్రేక్షకులు చూడని సరికొత్త లొకేషన్లు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈమూవీ ఏప్రిల్, 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియాలో హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    "It's a great character and I'm very excited. But that was one thing that I discussed with Cary. I said, 'We cannot identify him with any act of terrorism reflecting an ideology or a religion. That's not something I would entertain, so if that is why I am your choice then you can count me out'," Malek told UK's The Mirror about Bond 25 villain role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X