»   » ఇన్‌ఫెర్నో: ఆస్కార్ విన్నర్ టామ్‌ హ్యాంక్స్‌కు రానా వాయిస్!

ఇన్‌ఫెర్నో: ఆస్కార్ విన్నర్ టామ్‌ హ్యాంక్స్‌కు రానా వాయిస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ స్టార్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ టామ్‌ హ్యాంక్స్‌ హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్‌ చిత్రం 'ఇన్‌ఫెర్నో'. రాన్‌ హొవార్డ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. సినిమాలో టామ్ హ్యాంక్స్ పాత్రకు రానా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.

ఇటీవల రానా 'ఇన్‌ఫెర్నో'లోని కొన్ని సీన్లు చూసాడు. తనకు సినిమా బాగా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బాహుబలి-2 షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ రాత్రి పూట ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడట.

Rana Daggubati lends his voice for Tom Hanks

'ఇన్‌ఫెర్నో' గురించి, టామ్ హ్యాంక్స్ గురించి రానా మాట్లాడుతూ.... ''టామ్‌ హ్యాంక్స్‌ గ్రేట్ యాక్టర్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తన అభిమాన నటుడి పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది.
ఆయన పాత్రకు నేను డబ్బింగ్‌ చెబుతున్న క్షణాలను రికార్డ్‌ చేసుకున్నాను. డబ్బింగ్‌ చెప్పడం ఓ నటుడిగా నాకెంతో ఉపయోగపడింది. ఓ విధంగా అది టామ్‌ హ్యాంక్స్‌ నుంచి శిక్షణ తీసుకోవడం లాంటిదే. భళ్లాలదేవ, రాబర్ట్‌ లాంగ్‌డన్‌.. ఈ రెండు నా జీవితంలో గర్వంగా చెప్పుకునే పాత్రలుగా నిలుస్తాయని రానా చెప్పుకొచ్చారు.

ఇండియన్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ ఈ మధ్య పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఇన్‌ఫెర్నో' కూడా ఇర్ఫాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇర్ఫాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ టామ్‌ హ్యాంక్స్‌ పొగడ్తలు గుప్పించారు.

ఇర్ఫాన్ ఖాన్ తో చేస్తున్నపుడు ఇండియన్‌ సీన్‌ కానరీతో నటిస్తున్నట్లు భావించాను. మా ఇద్దరి మధ్య చాలా విషయాల్లో సారూప్యత ఉంది అంటూ హ్యాంక్స్‌ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

English summary
Ron Howard’s Hollywood film, INFERNO, is gearing up for its release in India on October 14. Baahubali star Rana Daggubati will be lending his voice for the Telugu version of Inferno, as the voice for Tom Hanks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu