వృత్తిపరమైన సంబంధం కాస్త రొమాన్స్‌గా మారిన వైనం
రాపర్ డ్రేక్ బ్రిటన్ పర్యటన కోసం తన మ్యూజిక్ టూర్‌లోకి సపోర్ట్ కోసం మ్యూజిక్ సంచలనం రీటా ఓరాని ఎంచుకున్నాడు. ఐతే వీరిద్దరూ రొమాన్స్ లో భాగంగానే ఇలా కలిశారని పుకార్లు చక్కెర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలసి గతంలో చాలా మ్యూజిక్ వీడియోలకు పని చేయడం జరిగింది. వృత్తిపరమైన సంబంధం కాస్త శృంగారంలోకి వికసించిందని అందరూ భావిస్తున్నారు. సోమవారం లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న వీరిద్దరూ స్టేజికి వెనుక భాగన ముద్దులతో సరసాలుడుతూ కెమెరాలకు చిక్కారు.
వీరిద్దరి స్టేజి వెనుక భాగాన చూసినటువంటి ఓ ప్రతినిధి గత వారంలో ఓరా, డ్రేక్ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ.. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరిని చూసిన తర్వాత ఇద్దరూ డీప్‌గా రోమాన్స్‌లో మునిగిపోయారని అన్నాడు. గతంలో డ్రేక్ పాప్ సింగర్ రిహానాతో డేటింగ్ చేయగా.. ఓరా మాత్రం రాబ్ కర్దాషియన్‍తో డేటింగ్ చేసింది.


Click it and Unblock the Notifications











