నగ్నంగా యోగాసనాలు వేస్తోంది
లాస్ ఏంజిల్స్ : ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే జనాలు పట్టించుకోరనే విషయం చాలా మంది సెలబ్రెటీలకు తెలుసు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండటానికి ప్రయత్నించే నటి,టీవి స్టార్ కిమ్ కర్ధాషియన్ ఇలాంటి వాటిల్లో మరింత ముందుంటుంది. తాజాగా ఆమె నగ్నంగా యోగా చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. ఆమె యోగాకు చెందిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఆమె ఒంటరిగా కాకుండా తన భర్త కేనీ వెస్ట్ తో కలిసి ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తోంది. ఈ దంపతులు ఈ యోగా కోసం ప్రత్యేకంగా ఓ శిక్షకుడుని నియమించుకున్నారు. తమ ఇంట్లోనే ఈ యోగా కార్యక్రమం నిర్విరామంగా జరుపుతున్నారని హాలీవుడ్ వార్తలు రాసే ప్రముఖ వెబ్ సైట్ ఒకటి ఈ వార్తను వెలుగులోకి తెచ్చింది. అయితే ఈ మ్యాటర్ ..ఆ మీడియా హౌస్ కు ఆమే లీక్ చేసిందని వినపడుతోంది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... తన భర్త వెస్ట్ గతంలో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోలేక ఇబ్బంది పడేవాడని అంది. దీంతో ఇద్దరూ కలిసి యోగా ప్రాక్టీస్ చేయటం మొదలెట్టామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ యోగాతో ప్రశాంతత చేకూరిందని అంటోంది. ఈ సలహా తనే ఇచ్చానని గర్వంగా చెప్తోంది. ఈ యోగాని అందరూ చేసి మంచి ఫలితం పొందాలని అంటోంది.


Click it and Unblock the Notifications











