అదీ గ్లామర్ అంటే...ఫొటోనే నాలుగు లక్షలు రేటు

By Srikanya

లండన్: గొప్పవాళ్ల గొప్పతనం వారు పోయిన తర్వాత కూడా కీర్తింపడుతుంది...గుర్తింబడుతూంటుంది..ఇంకా చెప్పాలంటే పెరుగుతుంది. అలాంటిదే హాలీవుడ్ అందాల శృంగార తార మార్లిన్ మన్రో విషయంలోనూ జరుగుతోంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పాత ఫొటోలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

తాజాగా ఆమె సినిమాల్లోకి రాకముందు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి 1946 నాటిది వేలానికి పెట్టగా...£4,250 (దాదాపు నాలుగు లక్షల రూపాయలు) పలికింది. ఈ ఫొటోను అప్పట్లో ఏజెన్సీ ఫొటో గ్రాఫర్ జోసెఫ్ జస్గర్ తీసారు. ఆమె వీరాభిమాని ఒకరు ఈ ఫొటోను సొంతం చేసుకున్నారు.

Record Price for Heroine Marilyn Monroe Photo

ఈ ఫొటో ఆమె మొట్టమొదటసారిగా కాలిఫోర్నియాలోని జూమా బీచ్ లో మోడలింగ్ చేసినప్పుడు అని చెప్తున్నారు. ఈ ఫొటో దిగేనాటికి ఆమె ఇంత గొప్ప స్టార్ అవుతుందని ఎవరూ ఊహించలేదు అంటున్నారు. ఇక ఈ ఫొటో నెగిటివ్,కాపీ రైట్స్ కూడా త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. దానికి కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు.

1950లో మార్లిన్ మన్రో హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం 'డోన్ట్‌ బాదర్‌ టు నాక్' విడుదలవుతున్న సందర్భంగా - ఓ క్యాలెండర్‌ పై ఆమె నగ్న చిత్రాన్ని విడుదల చేచే సరికి అది హాలీవుడ్‌లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ''ఎందుకు అలాంటి ఫోజ్‌ ఇచ్చారు'' అని మీడియావారు ప్రశ్నిస్తే ''ఆకలి బాధకు తాళలేక'' అని జవాబిచ్చింది మార్లిన్‌. ఆమె జీవితం, ఆమె వివాహాలు, వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యాలూ అన్నీ సంచలనాత్మకంగా ఉండేవి. నటిగా పరిణత చెంది మరెన్నో విజయాలు సాధించవలసిన తరుణంలో మార్లన్‌ అర్ధాంతరంగా జీవితరంగం నుంచి నిష్రమించింది. ఆమె పేదరికాన్ని ఎదిరించ గలిగింది కానీ లెక్కకు మించిన సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతలనూ తట్టుకోలేకపోయింది!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X