పెళైన చాలా రోజులకు హానీమూన్ చేసుకున్న జంట

రీసి వితర్ స్పూన్, జిమ్ టోత్ ఇద్దరూ కూడా పెద్ద సెలబ్రిటీలు అయినప్పటికీ ఓ సాధారణ రెగ్యులర్ టూరిస్ట్‌లకు మల్లే పారిస్ మొత్తం చుట్టివచ్చారు. పెళ్లి అయి చాలా రోజులు అయినప్పటికీ వీరిద్దరూ కూడా రోమాంటిక్ ట్రిప్‌లో చాలా అన్యూనంగా కనిపించడం విశేషం. ట్రిప్ అంతా పూర్తి అయిన తర్వాత ఈ జంట ఛార్జెస్ డి గాల్లీ ఎయిప్ పోర్ట్‌కి రావడం జరిగింది. ఎయిర్ పోర్ట్‌లో కూడా ఇద్దరూ సామాన్య వ్యక్తులు మాదిరే ప్రదర్శించడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పై ఫోటోలో ఎయిర్ పోర్ట్‌లో లగేజి కోసం వెయిట్ చేస్తూ బయట కుర్చీలలో కూర్చోని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటుండగా క్లిక్ మనిపించిన పోటో. అందులో రీసి వితర్ స్పూర్ తన భర్త సిఎఎ ఏజెంట్ అయిన జిమ్ టోత్‌కి ఏదో చెబుతుండగా ఆమె వైపు తదేకంగా జిమ్ టోత్ చూస్తున్నారు. ఆ తర్వాత జిమ్ టోత్ తన భార్యను దగ్గరకు తీసుకోని తన నుదుటిపై భాగాన్ ఆప్యాయంగా ముద్దు పెట్టడం జరిగింది.


Click it and Unblock the Notifications











