నా సినిమాలలో నటించినటువంటి హీరోలు పేర్లు అస్సలు గుర్తుండవు..

By Nageswara Rao

రీసివితర్ స్పూన్ హాలీవుడ్ అందగత్తేల్లో ఒకరు. అంతేకాకుండా రీసివితర్ స్పూన్ మంచి యాక్టర్ తో పాటు నిర్మాత కూడా. చిన్న తనంలోనే సినిమాలు అంటే ఇష్టంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అంతే ఇష్టంతో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కోట్టే సినిమాలు తీశారు. 2005 సంవత్సరంలో ఉత్తమ హీరోయిన్ గా అకాడమి అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా తీసుకున్నారు. ఎంతో ఇష్టపడి ప్రేమించిన క్రూయల్ ఇన్ టెంక్షన్స్ లో తనతో పాటు నటించినటువంటి 'రైన్ ఫిలిఫ్ఫీ' ని వివాహం చేసుకున్నారు. దీనికి గాను వీరికి ఇద్దరు సంతానం కలిగారు. కోన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు 2006 అక్టోబర్ లో విడిపోవడం జరిగినది. తర్వాత తను చిన్న పిల్లల అడైజీ కమిటి మెంబర్ గా కోనసాగారు. అంతే కాకుండా ఎవాన్ ఫౌండేషన్ భాద్యతలను స్వీకరించారు.

ఇటీవల కాలంలో రీసివితర్ స్పూన్ తన మనసులోని భావాలను వెల్లడించారు. ముఖ్యంగా తను నటించినటువంటి సినిమాలు తాను ఇంతవరకు అస్సలు చూడలేదని అన్నారు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈముప్పయి నాలుగు సంవత్సరాల చిన్నది అబధ్దాలు కూడా చాలా అందంగా ఆడుతుందని అందరూ అనుకున్నారు. మీసినిమాలు మీరు చూడకపోవడానికి కారణం ఏంటనీ ప్రశ్నించగా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.

నాసినిమాలు నేను చూడకపోవడానికి, వాటిని చూడడంవల్ల నాలో ద్వేషించుకునే ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. అంతేకాకుండా కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు గుర్తించుకునే శక్తి తగ్గిపోతుందని అన్నారు. దాంతో దీనికి సినిమాలు చూడకపోవడానికి కారణం ఏంటని హాలీవుడ్ జనాలు చెవులు కొరుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు ఇప్పిటి వరకూ తనతో పాటు సినిమాలలో నటించినటువంటి హీరోల పేర్లు కూడా తనకు గుర్తుండవు అని అనేశారు. ఐతే నేను నటించినటువంటి చాలా సినిమాలు బాక్సాఫీసు రికార్డులు నమోదు చేశాయన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X