అమ్మాయి గా కనిపించాలన్న అతని కోరికను అగ్రిమెంట్ తో కట్టేసింది...!!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తిరిగి క్యాటీ తనతో వుండేందుకు ఒప్పుకోవడంతో ఆనందంతో తబ్బుబ్బై పోతున్నాడు. మొదట అతనితో అనుబంధాన్ని తెంచేసుకున్నానని చెప్పిన క్యాటీ ప్రైజ్ ఇప్పుడు అతనితో సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవడానికి ఓ బలమైన కారణం వుందట.
అదేంటంటే రెయిడ్ ఎక్కడ తమ మధ్య జరిగిన సెక్స్ విషయాలు బయటపెడతాడో అని భయపడి అతని నోరు మూయించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అంతే కాదు అతను ఆమెతో సంబంధాన్ని కొనసాగించాలంటే ఆమె గురించి అనుమతి లేకుండా ఎక్కడా మాట్లాడకూడదని నిబంధన పెట్టిందట. అంతే కాదు క్రాస్ డ్రస్సర్ అయిన రెయిడ్ రోక్సీ పేరుతో అమ్మాయి వేషధారనతో చెలామణీ అయ్యేవాడు. మీరిక్కడ చూస్తున్న పోటో అలా వున్నప్పటిదే. కానీ ఇకపై అతను అలా విపరీతంగా ప్రవర్తించకూడదని కూడా నిబంధన పెట్టిందట.
అంతే కాదు అతని చేత ఈ నిబంధనలు అన్నీ పాటిస్తానని మాట తీసుకోవడమే కాదు, ఓ అగ్రిమెంటును కూడా తయారు చేయించి, సతకం చేయించుకుందట. ఒక వేళ అతను ఈ నిబంధనలు తప్పితే వెంటనే విడిపోదామని కూడా ఆ అగ్రిమెంట్ లో పేర్కొందట... ఇది విన్న వారంతా పాపం రెయిడ్...!! అంటున్నారట.


Click it and Unblock the Notifications











