twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైఖేల్ జాక్సన్ చనిపోయాక వేలాది కోట్లు... (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో తన హవా కొనసాగించాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.

    మైఖేల్ జాక్సన్ మరణించి నేటితో 5 ఏళ్లు పూర్తయింది. జాక్సన్ మృతికి ఆయన వైద్యుడు కాండ్రాడ్ ముర్రేనే కారణమని తేలింది. ప్రొపొఫోల్‌ అనే మందును మోతాదుకు మించి ఇవ్వడం వల్ల మైఖేల్ చేనిపోయినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ముర్రేకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. వివిధ కారణాలతో మర్రే రెండేళ్లకే జైలు నుండి విడుదలయ్యాడు.

    అయితే మైఖేల్ జాక్సన్ తన జీవిత కాలంలో సంపాదించని డబ్బు ఇపుడు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతోంది. మైఖేల్ జాక్సన్ సీడీల కాపీరైట్స్, మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ సందర్శన ద్వారా, అభిమానులు విరాళాలు పంపించడం ద్వారా ఇప్పటి వరకు 4 వేల కోట్లు సమకూరినట్లు మైఖేల్ జాక్సన్ కుమారుడు ప్రిన్స్ జాక్సన్ తెలిపారు. తన జీవిత కాలంలో జాక్సన్ 300 మిలియన్ డాలర్ల దానధర్మాలు చేసిన తన మంచి మనసు చాటుకున్నాడు. ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రిన్స్ జాక్సన్ తెలిపారు.

    మైఖేల్ జాక్సన్

    మైఖేల్ జాక్సన్

    ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" జాక్సన్ పాడినది.

    జాక్సన్ అవార్డులు

    జాక్సన్ అవార్డులు

    జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డు లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు.

    నెం.1 జాక్సన్

    నెం.1 జాక్సన్

    జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి.

    మిలియన్ల కొద్దీ కాపీలు

    మిలియన్ల కొద్దీ కాపీలు

    ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.

    English summary
    Many of us remember where we were on June 25th, 2009, the day that Michael Jackson tragically died of cardiac arrest as a result of acute propofol and benzodiazepine intoxication.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X