twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లో స్టేజి కూలిపోయి 16 మందికి గాయాలు

    By Nageswara Rao
    |

    మంగళవారం నాడు 'రెసిడెంట్ ఈవిల్ 5' సినిమా షూటింగ్ సంబంధించిన సెట్ హాఠాత్తుగా ఒక్కసారి కూలిపోవడంతో 16 మంది గాయలు పాలవ్వడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెనడా సిటీలోని టోరంటోలో జరుగుతుండగా ఈ సంఘటన సంభవించింది. ఈ విషయాన్ని కెనడియన్ పోలీసులు ధృవీకరించడం జరిగింది. కెనడియన్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ హాఠాత్తుగా స్టేజి కూలిపోవడంతో క్రూ మెంబర్స్, యాక్టర్స్‌కి గాయలయ్యాయి.

    వెను వెంటనే అందరిని హాస్పిటల్‌కు చేర్పించడం జరిగిందన్నారు. ఎక్కడైతే యాక్టర్స్ షూటింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ ఏరియాలోనే స్టేజి కూలిపోవడంతో ఎక్కువ మంది(16) గాయాలు పాలవ్వడం జిరిగింది. వెంటనే స్టూడియోకి ఎమర్జెన్సీ టీమ్స్, ఫైర్ డిపార్ట్ మెంట్స్‌ని పిలిపించడం జరిగింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే టొరొంటో న్యూస్ పేపర్ రాసిన కధనం ప్రకారం సినిమా షూటింగ్ నిజంగా గాయాలవ్వడంతో ఎవరికి నిజంగా రక్తం కారుతుందో, ఎవరిది డమ్మీ రక్తమో కనుక్కోవడానికి కొంచెం అంబులెన్స్ సిబ్బంది ఇబ్బంది పడ్డారని సమాచారం.

    ఇక ఈ విషయంపై స్పందించిన ఆఫీసియల్స్ మాత్రం ఈ ప్రమాదంలో ఎవరికి కూడా చనిపోయేటంత గాయాలు అవ్వలేదని స్పష్టం చేశారు. మొత్తం గాయపడిన వారిలో 10 మందిని దగ్గరలో ఉన్న జనరల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లడం జరిగిందని తెలియజేశారు. మిగిలిన 6 మెంబర్స్‌ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ చేర్పించడం జరిగిందన్నారు.

    ఇక రెసిడెంట్ ఈవిల్ సినిమా సిరిస్ విషయానికి వస్తే ఇదో ఫేమస్ మూవీ సిరిస్. ఈ సినిమాలను కస్టమర్స్ ఎంటర్టెన్మెంట్ కొసం గేమ్స్‌ రూపంలో కూడా రూపొందించడం జరిగింది. ఒకే సినిమాకి ఐదు సిరిస్‌లు రావడం ఇదే చరిత్రలో మొదటిసారి. అందులో కూడా ఉక్రెయిన్-అమెరికా హీరోయిన్‌ మిలా జోవోవిచ్ ఐదు సిరిస్‌లలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాని షూటింగ్ ప్రస్తుతం వెస్ట్ టొరొంటోలోని 'సినీస్పేస్ కిప్లింగ్' స్టూడియోలో తీస్తున్నారు. సాధ్యమైనంత వరకు షూటింగ్‌ని త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 14న 2012లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    16 people were injured when the stage of Resident Evil 5 collapsed on Tuesday. The injured which include actors and crew members were rushed to the hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X