Mission: Impossible ట్రైలర్ రివ్యూ ఊపిరి బిగపట్టే యాక్షన్ విన్యాసాలు.. కళ్లు చెదిరే టామ్ క్రూజ్ సాహసాలు
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబైంది. మిషన్ ఇంపాజిబుల్ మూవీ సీరీస్‌లో ఈ చిత్రం 7వది కావడం విశేషంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు ఈ సినిమా సిద్దమైంది. జూలై 12వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ గురించిన వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు వచ్చిన టామ్ క్రూజ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీ ట్రైలర్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌లో అద్బుతమైన యాక్షన్ విన్యాసాలు, ఛేజింగ్ సీన్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ట్రైన్ వెళ్లే రైల్వే ట్రాక్ బిడ్జిని పేలి పోవడం లాంటి సన్నివేశాలు వెన్నులో చలిపుట్టించేలా ఉన్నాయి. ఎత్తైన కొండపై నుంచి లోయలోకి మోటర్ బైక్‌తో లోయలోకి దూకే సీన్ టామ్ క్రూజ్ సాహసానికి మచ్చు తునకగా మారాయి.
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ సినిమాలో కేవలం యాక్షన్ సీన్లు, ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా భారీగా ఫన్ కూడా ఉందని ట్రైలర్ స్పష్టం చేసింది. దర్శకుడు క్రిస్టఫర్ మెక్ క్వారీ ఈ సినిమాను భారీగా టామ్ క్రూజ్ క్రేజ్, స్టామినాకు తగినట్టుగా రూపొందించారు. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు.
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ సినిమాలో విలన్ మానవుడు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావడం గమనార్హం. గత చిత్రాల్లో మాదిరిగా కాకుండా ఈసారి టెక్నాలజీతో ఢీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచాన్ని విధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన దుష్టశక్తులను ఎథాన్ ఎలా ఎదుర్కొన్నాడనే విషయాన్ని తెరపైన చూడాల్సిందే.

మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 2 ట్రైలర్‌లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్‌ను పొందుపరిచారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ప్రీమియర్‌ను రోమ్‌లో ప్రదర్శించడం తెలిసిందే. ఆ సినిమా ప్రివ్యూకు మంచి రెస్సాన్ రావడంతో చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టు కనిపించింది.
ఇండియాలోను, ఇతర దేశాల్లోను మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే ఇండియాలో 1.10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా రెండు రోజులు మరిన్నీ టికెట్లు అమ్ముడు పోవడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











