twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గాంధీ' దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌ బోరాగ్‌ మృతి

    By Srikanya
    |

    లండన్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత రిచర్డ్‌ అటెన్‌ బోరాగ్‌(90) కన్నుమూశారు. 1982లో ఆయన తీసిన గాంధీ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రిచర్డ్‌ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు మైకెల్‌ అటెన్‌ బోరాగ్‌ తెలిపారు.

    రిచర్డ్‌ 1923 ఆగస్ట్‌ 29న లండన్‌లో జన్మించారు. హాలీవుడ్‌లో నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తెల్లని గడ్డం, జట్టుతో ఆయన సరికొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌ సెట్‌ చేశారు. దీంతో ఆయన 'డికీ' అనే పేరుతో ప్రాచుర్యం పొందారు.

    'ఓ వాట్‌ ఎ లవ్లీ వార్‌', 'చాప్లిన్‌', 'షాడో లాండ్స్‌' తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'గాంధీ' చిత్రం ఆస్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎనిమిది విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.

    Richard Attenborough dies at 90

    ఆయన నటించిన 'జురాసిక్‌ పార్క్‌', 'మిరాకిల్‌ ఆన్‌ 34 స్ట్రీట్‌' చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2002లో 'పకూన్‌' చిత్రంలో రిచర్డ్‌ చివరిసారిగా కనిపించగా, ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం 'క్లోసింగ్‌ ద రింగ్‌'. రిచర్డ్‌ మృతిపై ఇంగ్లాండ్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

    'బ్రైటన్‌ రాక్‌' చిత్రంలో ఆయన నటన అద్భుతమని, 'గాంధీ' చిత్రం ఓ గొప్ప చిత్రమని కితాబిచ్చారు. రిచర్డ్‌ మృతి హాలీవుడ్‌కి తీరని లోటని ఈ సందర్భంగా కామెరూన్‌ అన్నారు.

    English summary
    Richard Attenborough, the respected British actor and Academy Award-winning director of “Gandhi,” the multiple-Oscar-winning best picture of 1982, has died. He was 90.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X