69 ఏళ్ల వయసులో తండ్రయిన ప్రముఖ నటుడు.. దలైలామా ఆశీర్వాదం తర్వాత!

ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేరే 69 ఏళ్ల వయసులో మరో బిడ్డకు తండ్రయ్యాడు. రిచర్డ్ గేరే గత ఏడాది ప్రచరకర్త అయిన 35 ఏళ్ల అలెజాండ్రా సిల్వాని వివాహం చేసుకున్నాడు. రిచర్డ్ వయసులో దాదాపు సగం వయసు మాత్రమే ఉన్నా సిల్వా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రిచర్డ్ ని పరిచయం చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట ప్రేమ ప్రయాణం మొదలైంది. గత మూడేళ్ళుగా రిచర్డ్, సిల్వా సహజీవనం చేస్తున్నారు. రిచర్డ్ కు ఇది మూడవ వివాహం కాగా, సిల్వాకు రెండవది.

మూడేళ్ళుగా సహజీవహం

మూడేళ్ళుగా సహజీవహం

రిచర్డ్, సిల్వా దంపతులకు గత వారం పండంటి మగబిడ్డ జన్మించినట్లు రిచర్డ్ అధికార ప్రతినిధి మీడియాకు వివరించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్ళుగా సహజీవహం చేస్తున్న రిచర్డ్, సిల్వా గత ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లోనే సిల్వా తన ప్రెగ్నెన్సీని కంఫర్మ్ చేసింది. తాను, రిచర్డ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సంతోషాన్ని వ్యక్తపరిచింది.

 ఇద్దరూ రెండవసారి

ఇద్దరూ రెండవసారి

తాజాగా కొడుకు జన్మించడంతో సిల్వా, రిచర్డ్ ఇద్దరూ రెండవసారి సంతానం పొందినట్లు అయింది. కాగా రిచర్డ్, అతడి రెండవ భార్య కేరి లోవెల్ కు హోమర్ జేమ్స్ అనే కొడుకు ఉన్నాడు. రిచర్డ్, కేరి దంపతులు 2016లో విడిపోయారు. ఆ తర్వాత రిచర్డ్, సిల్వా మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఇక సిల్వా తన మొదటి భర్త గోవింద్ కు ఓ కొడుకు ఉన్నాడు. సిల్వా తన మొదటి భర్త నుంచి 2015లో విడిపోయింది.

 దలైలామా ఆశీర్వాదం

దలైలామా ఆశీర్వాదం

గత ఏడాది సిల్వా గర్భవతి కాగానే తన భర్తతో కలసి దలైలామని సందర్శించారు. దలైలామా గర్భవతిగా ఉన్నా సిల్వాకు తన ఆశీర్వాదం అందించారు. ఈ ఫోటోని కూడా సిల్వా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. సిల్వా, రిచర్డ్ మధ్య 2014 నుంచే సంబంధం కొనసాగుతోంది. ఈ వార్తలతోనే సిల్వా ఆమె మొదటి భర్త గోవింద్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి 2015లో విడిపోయారు.

స్నేహితుల ద్వారా

స్నేహితుల ద్వారా

ఇక సిల్వా, రిచర్డ్ ఇద్దరూ ఒక్కటి కావడానికి వారి స్నేహితులు, సన్నిహితుల సలహానే కారణం అని అంటున్నారు. వ్యక్తిగత జీవితాలలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వీరిద్దరూ ఒక్కటయ్యేలా స్నేహితులు చేశారట. ఇదిలా ఉండగా తమ కుమారుడికి సిల్వా, రిచర్డ్ దంపతులు పేరు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ పేరు మాత్రం బయటకు ప్రకటించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X