Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రిన్సెస్ డయానా కోసం కొట్టుకొన్న హాలీవుడ్ హీరోలు.. పిడిగుద్దులతో రచ్చ రచ్చ
Recommended Video
అందానికి నిలుటెద్దు రూపం ప్రిన్సెస్ డయానాది. ఆమె రూపాన్ని చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. అలాంటి అందాలరాశిపై సామాన్యులు మనసు పడటం చాలా సహజం. కానీ ఆమె కోసం ఇద్దరు హాలీవుడ్ హీరోలు కొట్టుకోవడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇంతకు ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే..
డయానా కోసం గేరే, స్టాలన్
ప్రిన్సెస్ డయానాపై మనసు పడిన వారిలో హాలీవుడ్ యాక్టర్లు రిచర్డ్ గేరే, స్విల్వెస్టర్ స్టాలన్ అని ప్రముఖ సింగర్ ఎల్టన్ జాన్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఘటన లండన్‌లో వాల్ట్ డిస్నీ అధినేత జెఫరీ కాట్జెన్బర్గ్ ఇచ్చిన విలాసవంతమైన విందులో జరిగిందని ఆయన పేర్కొన్నారు.
భర్తతో డయానా వేరుపడి
ఆ సమయంలో ప్రిన్స్ చార్లెస్ నుంచి డయానా విడిపోయింది. అప్పడే రిచర్డ్ గేరే కూడా తన రిలేషన్‌ను సిండి క్రాఫోర్డ్‌తో తెగతెంపులు చేసుకొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో డయానా, గేరే నేరుగా కలుసుకొన్నారు. ఆమెతో అందరూ కలివిడిగా మాట్లాడారు. కానీ ఆ రూమ్‌లో వారిద్దరి చూస్తే ఓ కొత్త వాతావరణం కనిపించింది అని ఎల్టన్ జాన్ వెల్లడించారు.
ఆ హాలీవుడ్ హీరోతో డయానా
ప్రిన్సెస్ డయానాతో రిచర్డ్ గేరే ఫ్రెండ్ షిప్ చాలా క్లోజ్‌గా మారింది. అది సిల్వెస్టర్ స్టాలెన్కు నచ్చలేదు. దాంతో జెలసీతో స్టాలెన్ రగిలిపోయాడు. డయానాకు చేరువయ్యేందుకు ప్రయత్నించాడు. పార్టీలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించాడు అని ఎల్టన్ అన్నారు.
స్టాలన్, గేరే కొట్లాట
ఇక ఆ పార్టీలో ఏర్పాటు చేసిన డిన్నర్‌కు గేరే, స్టాలెన్ హాజరుకాలేదు. కానీ దూరంగా ఆ విందులో ఇద్దరు కొట్టుకోవడం, గొడవపడటం కనిపించింది. ఆ గొడవ తీవ్రస్థాయికి వెళ్లి ముష్టిఘాతాలు కూడా చోటుచేసుకొన్నాయి. ఆ సందర్భంలో కొందరు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది అని ఎల్టన్ తెలిపారు.
గేరే, డయానా రిలేషన్‌కు పుస్తకరూపం
లండన్‌లో పార్టీ తర్వాత ఓ చలిమంట ముందు డయానా, రిచర్డ్ గేరే కూర్చొని కబుర్లాడుకోవడం కనిపించింది. ఆ గొడవ తర్వాత తీవ్ర ఆగ్రహంతో స్టాలెన్ ఇంటికి వెళ్లిపోయారు. ఆ సందర్భాన్ని తలుచుకొని ఓ సారి గేరే తన మధురసృతులను గుర్తు చేసుకొన్నాడు. ఇలాంటి విషయాలకు గేరే పుస్తకరూపం కల్పించనున్నారు. ఈ పుస్తకం అక్టోబర్ 15న రిలీజ్ కానున్నది.