ఆ ఇద్దరి ప్రేమ పెటాకులైంది!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్టర్ రిచర్డ్ గేరె, నటి, టీవీ హోస్ట్ పద్మా లక్ష్మితో గత ఆరు నెలలుగా చాటు మాటు ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరు ప్రస్తుతం వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరికి మోజు తీరిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారట.
ఇటీవల ఇంటర్వ్యూలో పద్మా లక్ష్మి మాట్లాడుతూ....తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నట్లు వెల్లడించింది. పద్మా లక్ష్మి మన ఇండియాకు చెందిన భామ. అమెరికాలో సెటిలైంది. మోడలింగ్ రంగంలో నగ్న అందాల ఆరబోత విషయంలో అప్పట్లో ఆమె ఓ సంచలనం. తర్వాత నటిగా... టీవీ హోస్ట్‌గా తన ప్రయాణం సాగించింది.

44 ఏళ్ల పద్మలక్ష్మి అప్పట్లో వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీని వివాహమాడి అటుపిమ్మట 2007లో అతడికి విడాకులిచ్చింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తన మూడేళ్ల కూతురుకు తండ్రి ఎవరో ఆమె ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఎప్పుడూ ఏదో ఒక సంచలనం, వివాదాలతో వార్తల్లో నిలవడం పద్మా లక్ష్మి ప్రత్యేకత.


Click it and Unblock the Notifications