స్టార్ విలన్‌ కన్నుమూత

By Srikanya

న్యూయార్క్: జేమ్స్‌ బాండ్‌ విలన్‌ రిచర్డ్‌ కైల్‌ కాలిఫోర్నియాలో కన్నుమూశారు. కాలు విరగడంతో వారం క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఏడడుగుల రెండంగుళాల ఎత్తుగా, స్టీలు పళ్లతో 'జాస్‌' పేరుతో కొన్ని జేమ్స్‌ బాండ్‌ చిత్రాల్లో కనిపించి అలరించారు. 'స్పై హూ లవ్డ్‌ మీ' (1977), 'మూన్‌రేకర్‌' (1979) బాండ్‌ చిత్రాల్లో రిచర్డ్‌ పోషించిన జాస్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

1939 సెప్టెంబరు 13న మిచిగాన్‌లో పుట్టిన రిచర్డ్‌ 1960లో 'లారెమై' టీవీ కార్యక్రమం ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1961లో 'ది ఫాంథమ్‌ ప్లానెట్‌' ద్వారా వెండితెరకు వచ్చారు. 'ది మేన్‌ ఫ్రమ్‌ అంకుల్‌', 'ది వైల్డ్‌', 'వైల్డ్‌ వెస్ట్‌' లాంటి టీవీ కార్యక్రమాలు అతనికి మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇక 74ఏళ్ల రిచర్డ్‌కు గత వారం కాలు విరగగా, కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో గల సెయింట్ ఏగ్నెస్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు. రిచర్డ్ మృతి చెందిన విషయాన్ని ఆయన ఏజెంట్ స్టీవెన్ స్టీవెన్స్ ధ్రువీకరించారని అమెరికా మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. రిచర్డ్ మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో అభిమానులకు తెలిపారు.

Richard Kiel Dead: James Bond Villain ‘Jaws’ Dies At 74

‘రిచర్డ్ అనేక మందికి సినిమాల్లో విలన్‌గానే తెలుసు. అయితే నిజ జీవితంలో ఆయన ఎంతగా దయ, దాతృత్వ గుణం గలవారో ఆయనకు సన్నిహితులయిన వారికి మాత్రమే తెలుసు. రిచర్డ్ తన జీవితంలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. జీవిత చరమాంకంలో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితుల మధ్య గడపటం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రిచర్డ్ మరణం ఊహించనిదే అయినప్పటికీ గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X