twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1300 కోట్లతో నిర్మించిన చిత్రం.. తెలుగులో భారీ విడుదల

    By Nageswara Rao
    |

    సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన ఏలియన్, గ్లాడియేటర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సర్ రిడ్లే స్కాట్ దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రొమేథియస్-3డి'. ఈ చిత్రం తెలుగులో 'విధ్వంసక అన్వేషణ' పేరున విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. భారతదేశంలో ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం సెన్సేషనల్ మూవీ ద్వారా జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు.

    టైటానిక్, అవతార్‌లాంటి సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామరూన్ ఈ చిత్రకథా చర్చల్లో పాల్గొన్నాడు. ఆ చిత్రాల స్థాయిలో ఈ 'విధ్వంసక అన్వేషణ' ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నారు. దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం. ఆద్యంతం 3డి కెమెరాలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని అంటున్నారు.

    ఇక కథ విషయానికి వస్తే మానవజాతి మూలాలను కనుగొనేందుకు కాంతివేగం కంటే రెట్టింపు వేగంతో ప్రయాణం చేసే ప్రొమేథియస్ అనే స్పేస్‌షిప్‌లో కొందరు సాహసికులు ప్రయాణిస్తారు. ప్రాణాలకు తెగించి వారు చేసిన అంతరిక్ష ప్రయాణం ఎలాంటి అవాంతరాలకు లోనయ్యింది? చివరికి మానవాళిని ఏ విధంగా రక్షించారు? అనే ఊహాజనిత కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు.

    English summary
    Ridley Scott, director of “Alien” and “Blade Runner,” returns to the genre he helped define. With PROMETHEUS, he creates a groundbreaking mythology, in which a team of explorers discover a clue to the origins of mankind on Earth, leading them on a thrilling journey to the darkest corners of the universe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X