వేసవిలో విడుదలకు సిద్దమైన 'పాప్ సింగర్' సినిమా
హాలీవుడ్ పాప్ సింగర్ రిహానా తెరపై కనిపించి, తన నటనతో అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. రిహానా తొలిసారి నటించిన 'బ్యాటిల్ షిప్' సినిమా ఈ సంవత్సరం వేసవిలో విడుదలకు సిద్దమైంది. పీటర్ బెర్గ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్లాసిక్ హాస్బ్రో నౌకా యుద్ధ క్రీడ ఆధారంగా చిత్రీకరిస్తున్నారు.
నావికాదళ యుద్ధం గేమ్స్ వ్యాయామం పై ఒక గ్రహాంతర ఆర్మడ ద్వారా వచ్చిన యుద్ద నౌకలపై విజయం ఎలా సాధించాయనే ముఖ్య కథాంశంతో సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో లీడ్ రోల్‌ని నైమ్ లీసాన్ పోషించనున్నాడు. ఈ నెల చివరి నుండి నైమ్ లీసాన్‌కు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శకుడు పీటర్ బెర్గ్ తెలిపారు.
24 సంవత్సరాల వయసు కలిగిన సింగర్ రిహానా తన ఫెర్పామెన్స్ ద్వారా నిర్మాతలను, దర్శకులను ఒప్పించడమే కాకుండా, ఆమె నటనతో వారిని కట్టిపడేసినట్లు సమాచారం. దర్శకుడు పీటర్ బెర్గ్ మాట్లాడుతూ రిహానా పాత్ర చాలా సహాజంగా ఉంటుంది. ఈ సినిమాలో రిహానా పాత్ర జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ పాత్ర మాదిరి ఉంటుంది. ఈ సినిమాలో నటన ద్వారా రిహానాకు మరిన్ని సినిమాలో నటించే అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రిహానాకు లభించిన గొప్ప అవకాశం ఈ సినిమా. ఐతే తన మ్యూజిక్ ప్రాజెక్టులను, సినిమా షూటింగ్స్ రెండింటిని ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











