మా బంధం ధృడమైంది: ప్రముఖ సింగర్
హాలీవుడ్ సింగర్ రిహానా తన తోటి సింగర్ కాటి పెర్రీతో ఉన్న తత్సంబంధాలను నెమర వేసుకున్నారు. నాకున్న స్నేహితులలో ఆమె నమ్మదగిన దని... చెప్పాలంటే ఆమె ఒక బలమైన జీవి. నేను కూడా పెర్రీ లాగా నిజ జీవితంలో జీవించాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను తెలిపారు. హాలీవుడ్ పరిశ్రమలో నా బెస్ట్ ఫ్రెండ్స్‌లలో పెర్రీ ఒకరని అన్నారు.
నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో పెర్రీని అనుకరిచండం చేశానని అన్నారు. నా జీవితంలో నేను కలసిన మంచి వ్యక్తులలో పెర్రీ ఒకరు. తన నిజాయితీ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. తనతో కలసి పని చేయడం నాకు ఎంతో సంతోషానిస్తుందని రహానా ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.
27 సంవత్సరాల వయసు కలిగిన కాటీ పెర్రీ ఇటీవల ప్రేమించే పెళ్లి చేసుకున్న బ్రిటీష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌తో 14 నెలలు అతనితో జీవించి ఆ తర్వాత కొన్ని మనస్పర్దలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ భారతదేశంలో సాంప్రదాయబద్దంగా వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే.
తన భర్త నుండి కాటీ పెర్రి విడిపోయిన తర్వాత గతంలో తనని ఎంతగానో ప్రేమించిన ప్రెంచ్ మోడల్ 'బాప్టిస్ట్ గియాబికోని'తో పారిస్ హోటల్స్లో చక్కెర్లు కొడుతుందని వీరిద్దరి చూసిన వారు అంటున్నారు. అంతేకాకుండా ప్రేమలో పడిన కొత్త జంట ఎలాగైతే ఉంటుందో అలానే చెట్టాపట్టాలేసుకోని వీరిద్దరూ పారిస్ వీధులన్నీ తిరిగారని వీక్షకులు తెలిపారు.


Click it and Unblock the Notifications











