లెస్బియన్ గా వుండటంలో తప్పులేదు...!!

By Kuladeep

హాలీవుడ్ సెక్సీ సింగర్ రిహన్నా ప్రస్తుతం నటనమీద తగని మక్కువ పెంచుకొని, సినిమాల్లో నటించేందుక సిద్ధమయిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నలో తనకి ఎలాంటి పాత్ర వెయ్యాలనుందనే ప్రశ్నకు సమాధానంగా తను ఓ కిల్లర్ పాత్రలో లేదా లెస్బియన్ గా నటించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

వీలయితే మరో హాలీవుడ్ సెక్సీ తార జూనియర్ ఏంజలీనాగా పిలువబడే మేఘన్ ఫాక్స్ తనకు జోడీగా నటిస్తే బాగుంటుందని కూడా చెప్పింది. అందులోనూ ఆమె చాలా హాట్ గా వుండి ఆడవారిని కూడా ఆకట్టుకునేలా వుందని తెలిపింది. ప్రతీ మనిషకి ఆడవారిని, మగవారిని ఆకట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని, అలాగే తనని మేఘన్ ఫాక్స్ ఆకర్షించిందని, బహుశా భవిష్యత్తులో తను మరో అమ్మాయితో బంధాన్ని ఏర్పరచుకోవచ్చని ఆమె తెలిపింది.

కాగా ఈ మాట విన్న హాలీవుడ్ దర్శకులు వీరిద్దరూ లెస్బియన్లుగా నటిస్తే ఎలావుంటుందో అని అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారంట. మరి ఈ సెక్సీ తారలు ఇద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే వారి అభిమానులకు పండుగే...!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X