అజీర్తి చేసి హాస్పిటల్ పాలైన సూపర్ సింగర్
23 సంవత్సరాలు వయసు కలిగిన ప్రముఖ హాలీవుడ్ సింగర్ రిహానా సోమవారం స్వీడెన్‌లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన స్టేజీపై ఫెర్పామెన్స్ ఇవ్వాల్సి ఉండగా, హాఠాత్తుగా విష పడిశం, శీతల జ్వరం రావడంతో షో ని నిలిపివేయడం జరిగింది. దీంతో స్వీడన్‌కు అతి సమీపంలో ఉన్న మెడికల్ సెంటర్‌లో రిహానానని చేర్పించడం జరిగింది. దీంతో షో కి టిక్కెట్లు కొన్న అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురి అవడం జరిగింది.
అభిమానుల భాదను అర్దం చేసుకున్న సింగర్ రిహానా తనయొక్క మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో షో ఆగిపోయినందుకు అభిమానులను క్షమించాలని కొరడం జరిగింది. ఇది మాత్రమే కాదు మెడికల్ సెంటర్‌లో తాను బెడ్‌పై ఉన్న ఫోటోని అభిమానుల కొసం ప్రత్యేకంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక తన ట్విట్టర్ ఎకౌంట్లో అభిమానులు అందరికి మాల్మోలో షో ఆపినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. మీ అందరి ముందు అత్యంత అధ్బుతంగా ఫెర్పామెన్స్ ఇవ్వాలని నాకు ఉంది. కానీ ఏ చేద్దాం హాఠాత్తుగా నాకు శీతల జ్వరం రావడంతో హాస్పిటల్‌కు వెళ్లడం జరిగిందని అన్నారు. షో లేనందుకు నేను నిరాశకు గురి అయ్యాయని ట్వీట్ చేశారు.
ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన రిహానా స్టే షో ఫెర్పామెన్స్‌లో ఆమె అందాలను అభిమానులకు ఎరగా వేసి ఊర్రూతలూగించింది.


Click it and Unblock the Notifications











