నెక్ట్స్ జేమ్స్ బాండ్ మూవీలో ఆమె అతిథి పాత్ర?
లాస్ ఏంజిల్స్: అమెరికన్ పాప్ స్టార్ రిహానా....త్వరలో రాబోతున్న నెక్ట్స్ జేమ్స్ బాండ్ మూవీలో అతిథి పాత్రలో కనిపించనుందని తెలిస్తోంది. ఈ మేరకు ఆమెను బాండ్ మూవీ మేకర్స్ సంప్రదించినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రిహానా కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాండ్ హీరోగా కొనసాగుతున్న డేనియల్ క్రెగ్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ...రిహానా బాండ్ గర్ల్‌గా నటించాలని ఆకాంక్షించాడు.
త్వరలో రాబోతున్న నెక్ట్స్ బాండ్ సినిమా వివరాల్లోకి వెలితే...
చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్ డిసెంబర్ 6న మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. లండన్ లోని పినెవుడ్ స్టూడిమోస్ సమీపంలో ఈ షూటింగ్ జరుగనుంది.

‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటించబోతున్నాడు.
గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ పని చేయబోతున్నారు.
2015 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్రిటన్‌లో అక్టోబర్ 23, 2015న, అమెరికాలో నవంబర్ 6, 2015న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











