twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమాని దాడి‌లో గాయపడిన సెక్సీ బ్యూటీ...(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    లండన్: పాప్ స్టార్ రిహానా అభిమాని దాడిలో గాయపడింది. ఇటీవల లండన్ లోని ఓ నైట్ క్లబ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల రిహానా తన మోడల్ ఫ్రెండ్ కారాతో కలిసి శనివారం రాత్రి నైట్ క్లబ్ నుంచి తిరిగి వస్తుండగా ఓ అభిమాని ఆమోపైకి ఎనర్జీ డ్రింగ్ బాటిల్ విసిరాడు. దీంతో అది బలంగా వచ్చి ఆమె మోకాలికి తగిలి చిన్నగా రక్తస్రావం జరిగింది.

    అది మెటల్ బాటిల్ కావడం, చీలి పోయిన దాని భాగం బలంగా ఆమెకు తాకడంతో చర్మానికి గాటుపడి రక్తస్రావం జరిగింది. రిహానాను వెంటనే లండన్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాడి చేసిన వ్యక్తి ఇంకా దొరకలేదని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

    రిహానా బాడీ గార్డ్ దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు. ఆ వెర్రి అభిమాని ఆమెపైకి బాటిల్ విసిరేప్పుడు రిహాన మాజీ బాయ్ ఫ్రెండ్ క్రిస్ బ్రౌన్ గురించి ఏదో గట్టిగా అరిచనట్లు సంఘటన స్థలంలోని కొందరు అంటున్నారు. 23 ఏళ్ల బ్రౌన్ 2009లో ఆమెపై భౌతికంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం సింగర్ రిహానా బాస్కెట్ బాల్ ప్లేయర్ 'జూనియర్ స్మిత్' తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్‌లో రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి.

    English summary
    London: Singer Rihanna was forced to seek medical attention after a fan threw a bottle of energy drink Lucozade at her due to which she fell and hurt her knee. It happened when the 24-year-old was leaving a night club here with her model friend Cara Delevingne Saturday night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X