ఆమెపై ఇప్పటికీ చచ్చేంత మోజు..!
హలీవుడ్ గాయని 'జెస్సీ జె' ఇప్పటికీ పాప్ స్టార్ రిహానాపై క్రష్ ఉందని ఒప్పుకుంది. రిహానా ఎల్లప్పుడూ అభిమానుల గుండెల్లో ఎత్తులోనే ఉంటుంది. అందుకే నేను ఆమె లక్షణాలు ప్రేమిస్తున్నాను. రిహానాని కలిసింది తక్కువ సార్లై అయినప్పటికీ.. నిజ జీవితంలో చాలా అందంగా.. హుందాగా ఉంటుందని 24 సంవత్సరాల వయసు కలిగిన బై సెక్సువల్ సింగర్ జెస్సీ జె తెలిపింది.
ఇక రిహానా సడన్‌గా ఆస్టన్ కుచర్ కబ్బాలాహ్ గ్రూప్‌లో చేరడానికి గల కారణం వీరిద్దరూ గత డిసెంబర్ నుండి సీక్రెట్ గా డేటింగ్ చేస్తుండమేనని అంటున్నారు. డిసెంబర్‌లో ఓ స్నేహితుని పార్టీలో వీరిద్దరూ అసంబద్దంగా కలవడం.... ఆ తర్వాత మొబైల్ నెంబర్స్ తీసుకోవడం ద్వారా వీరి డేటింగ్ మొదలైనట్లు సమాచారం.
కానీ సింగర్ రిహానా మాత్రం ఆస్టన్ కుచర్ కబ్బాలాహ్ గ్రూప్‌లో చేరడానికి కారణం తాను త్వరలో లాస్ ఏంజిల్స్‌లో విడుదల చేయనున్న ఆల్బమ్‌కు ఇది ఉపయోగపడుతుందనే భావనతోనే చేరినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications











