ఛారిటీ కోసం ఓ గంట తన ప్రదర్శన ఇవ్వడానికి అంగీకరించిన హీరోయిన్
గ్రామీ అవార్డ్ విన్నర్ సింగర్ రిహానా ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఛారిటీ కోసం ఓ గంట పెర్పామెన్స్ చేయనున్నారు. దీనికి గాను రిహానా వసూలు చేసినటువంటి మొత్తం డబ్బులు 500,000డాలర్లు. డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం రిహానా తన వంతు సహాయం అందించనున్నారు. దీనిలో భాగంగా రిహానా ఆరు వందల మంది గెస్ట్‌ల ముందు తన పెర్పామెన్స్ ఇవ్వడానికి సిద్ద పడ్డారు. గతంలో రిహానా ఛారిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నడూ నిర్వహించకపోవడంతో, మొట్టమొదటిసారి చేస్తున్నటువంటి ఈకార్యక్రమం బాగా క్లిక్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
ఈ ఈవెంట్‌లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గవి విఐపి టేబుల్స్. పది మంది కూర్చోవడానికి వీలుగా ఉండేటటువంటి ఈటేబుల్స్ ఈవెంట్ మొత్తానికి చాలా ఎక్కువ మొత్తం చెల్లించి ఈ టేబుల్స్‌ని బుక్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఈవెంట్‌లో రేటు తక్కువగా ఉన్నటువంటి టేబుల్ ఖరీదు 2000డాలర్లు మాత్రమేనని ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్పడం జరిగింది. ఏది ఐతేనేం రిహానా ఇంకా బాగా డబ్బులు సంపాదించాలని, తాను సంపాదించినటువంటి వాటిల్లో కొంత సోమ్ముని ఇలా ఛారిటీలకు అందజేయాలని కోరుకుందాం..ఇంతకీ ఈఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే పామ్ బీచ్‌లో ఉన్నటువంటి డోనాల్డ్ ట్రంప్స్ మాన్సన్‌లో జరగనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











