సువాసన సెంట్ కోసం అర్ద నగ్నంగా ఫోటోషూట్ చేసిన సింగర్..
ట్విట్టర్‌లో సుమారు 20 మిలియన్ ఫాలోవర్స్.. తన అభిమానులను ఎల్లప్పుడూ ఎంటర్టెన్మెంట్ చేయడంలో తనది ప్రత్యేక శైలి. ఎవరి గురుంచి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా.. హలీవుడ్ ప్రముఖ సింగర్స్‌లలో ఒకరైన రిహానా. 24 సంవత్సరాల వయసు కలిగిన రిహానా తన అభిమానుల కోసం టాప్ లెస్ ఫోటోలను నిన్న ఆన్ లైన్‌లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే...
రిహానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న కొత్త 'సువాసన సెంట్' కోసం ఓ సరిక్రొత్త ఫోటోషూట్‌ని చేసింది. ఈ ఫోటోషూట్‌లో రిహానా అర్ద నగ్నంగా తన అందాలను ఆరబోసింది. ఈ ప్రక్కనున్న చిత్రంలో ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా తెలివిగా తన బ్రెస్టుని రిహానా తన చేతులతో ఏమీ కనిపించకుండా కవర్ చేసిన తీరు అధ్బుతం.
తాను నటించిన అర్ద నగ్న ఫోటోషూట్‌లో తన ఒంటి మీద ఉన్న నక్లెస్‌తో పాటు, తన వీపు వెనుక భాగాన ఉన్న టాటూ మాత్రమే కనిపించే విధంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ ద్వారా రిహానా మొత్తం నాలుగు ఫోటోలను విడుదల చేసింది. ఇటీవల సింగర్ రిహానా ముఖ్య పాత్రలో 'బ్యాటిల్‌షిప్' అనే సినిమాలో నటించింది. ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రనిర్మాణ సంస్థ యూనివర్శల్ పిక్చర్స్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'బ్యాటిల్‌షిప్' అనే చిత్రాన్ని నిర్మించింది.
నావికాదళ యుద్ధం గేమ్స్ వ్యాయామం పై ఒక గ్రహాంతర ఆర్మడ ద్వారా వచ్చిన యుద్ద నౌకలపై విజయం ఎలా సాధించాయనే ముఖ్య కథాంశంతో సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో లీడ్ రోల్‌ని నైమ్ లీసాన్ పోషించనున్నాడు. 24 సంవత్సరాల వయసు కలిగిన సింగర్ రిహానా తన ఫెర్పామెన్స్ ద్వారా నిర్మాతలను, దర్శకులను ఒప్పించడమే కాకుండా, ఆమె నటనతో వారిని కట్టిపడేసినట్లు సమాచారం. దర్శకుడు పీటర్ బెర్గ్ మాట్లాడుతూ రిహానా పాత్ర చాలా సహాజంగా ఉంటుంది. ఈ సినిమాలో రిహానా పాత్ర జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ పాత్ర మాదిరి ఉంటుంది. ఈ సినిమాలో నటన ద్వారా రిహానాకు మరిన్ని సినిమాలో నటించే అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











