హోటల్ ప్రమాదం నుండి క్షేమంగా బయట పడ్డ సింగర్ రిహానా
లండన్, జూన్ 28: పాప్ స్టార్ రిహానా ఒక భారీ అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నారు. రిహానాతో పాటు సుమారు 300 మంది అతిధులు ఈ ప్రమాదం నుండి రక్షించబడ్డారు. హోటల్‌లో ఉన్న లిప్ట్ షాప్ట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇక వివరాల్లోకి వెళితే 24 సంవత్సరాల వయసు కలిగిన రిహానా తన ట్విట్టర్ ఎకౌంట్లో టాక్సీ వెనుక భాగాన కూర్చోని చలువ కళ్ళద్దాలను ధరించి ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది. ఈ ఇమేజి క్రింద 'ఉదయం 6 సమయంలో వీధుల్లో' అంటూ క్యాప్సన్ వ్రాసింది. తర్వాత వెంటనే కోరొంతయా హోటల్ వెలుపల ఫైర్ ఇంజన్ ఉన్న మరో ఛాయాచిత్రాన్ని పోస్ట్ చేసింది.
దీనిని బట్టి అర్దం అయింది ఏమిటంటే హోటల్ నుండి మేము క్షేమంగానే రక్షించబడ్డాం. హోటల్‌లో సంభవించిన మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ కూడా వచ్చిందని తెలియేజేసింది. ఈ ఫైర్ యాక్సిడెంట్‌పై హోటల్ సిబ్బంది మాత్రం ఏమంత సీరియస్‌గా తీసుకోలేదు. దీనిపై మాట్లాడతూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. అందరిని క్షేమంగా రక్షించేలా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు. సర్విస్ ఎలవేటర్ మోటార్ కాలిపోవడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే ఫైర్ అలారం మ్రోగడంతో అందరూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
సింగర్ రిహానా బాస్కెట్ బాల్ ప్లేయర్ 'జూనియర్ స్మిత్' తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్‌లో రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. రిహానా ఫ్లోరిడాలో జరిగిన ఓ ఈవెంట్లో కలుసుకోవడం జరిగిందని సమాచారం. వారాంతంలో వీరిద్దరిని చూసిన వారు ఇద్దరూ కలిసి ఏకాంతంగా కొంత సమయం గడిపినట్లు తెలిపారు. గతంలో రిహానా క్రిస్ బ్రౌన్‌తో డేటింగ్ చేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











