కాపీ కొట్టినందుకు కొర్టు బయట సెటిల్‌మెంట్ చేసిన సింగర్
సాధారణంగా మనకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మొదట మనం శాంతంగా పరిష్కరించుకొవాలని చూస్తాం. అలా కాని పక్షంలో కోర్టుల ద్వారా వాటిని పరిష్కరించుకుంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ ప్రముఖ హాలీవుడ్ సింగర్ విషయంలో సంభవించింది. ఇంతకీ ఎవరా సింగర్ అని అనుకుంటున్నారా.. రిహానా.
రిహానా మాత్రం ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ వచ్చిన వచ్చిన గొడవను కోర్టు బయట ఈజీగా డీల్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డేవిడ్ లాచేపిల్లీ రిహానా 2010 సింగిల్ పెట్టినటువంటి ఫోజోలు కొన్ని తన సొంతంగా షూట్ చేసుకున్న ఫోజులు మాదిరి ఉన్నాయంటూ, రిహానా వాటిని కావాలనే కాపీ కొట్టిందంటూ అందుకు గాను $1 మిలియన్ చెల్లించాల్సిందిగా కొర్టుని ఆశ్రయించడం జరిగింది.
ఈ విషయం తెలిసిన సింగర్ రిహానా కొర్టు బయట అతనికి కొంత సొమ్ము చెల్లించి కేసుని డీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన డేవిడ్ ఈ విషయాన్ని బహిరంగంగా కేసుని విరమించుకుంటున్నానని, రిహానా చెల్లించిన సొమ్ముకి తాను సంతృప్తి చెందానని తెలిపాడు. ఇది ఇలా ఉంటే రిహానా ఇటీవల జార్జియో అర్మానీ అండర్ వేర్ ఎడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్‌లో అర్దనగ్నంగా తన అందాలను ప్రదర్శించారు. 23 సంవత్సరాలవయసు కలిగిన సింగర్ రిహానా తన అందాలను బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో ప్రదర్శించారు. మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోటోలలో రిహానా లేసీ బ్రా ధరించి, లెధర్ జాకెట్, స్కిన్ టైట్ జీన్స్‌తో కారు మందు ఫోజు ఇవ్వడం జరిగింది.


Click it and Unblock the Notifications











