నా పుల్ సపోర్ట్ స్నేహితురాలికే...!
ప్రేమించి పెళ్లి చేసుకున్న సింగర్ క్యాటి పెర్రి, తన భర్త రస్సెల్ బ్రాండ్‌ను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే తన భర్త తన నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడో లేదో తన స్నేహితురాలు మరో సింగర్ రిహానా, పెర్రికి బాసగా నిలిచింది. ఈ సందర్బంలో సింగర్ రిహానా మాట్లాడుతూ తన 14 నెలలు కలసి జీవించిన తర్వాత తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అందుకు గల కారణాలను పెర్రి ఫోన్ చేసి మరీ నాతో పంచుకుందని అన్నారు.
ప్రస్తుతం తాను ఉన్న పరిస్దితులలో ఎవరితో కూడా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. రస్సెల్ బ్రాండ్‌కి పిల్లలంటే చచ్చేంత ఇష్టం అంట. తన భార్యతో మనం ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని కోరగా, అందుకు క్యాటీ పెర్రీ అంగీకరించ లేదు. దీనికి గాను రస్సెల్ బ్రాండ్, భార్య నుండి విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడు.
ఈ విషయం తెలిసిన క్యాటి పెర్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనుకావడమే కాకుండా, తన తల్లి దండ్రులను పిలిచి జరిగిన కధనాన్ని తెలుపగా వారు క్యాటి పెర్రికి సోపర్ట్‌గా నిలిచారు. అసలు రస్సెల్ ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదని రిహానా స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











