మా అక్క మంచి విద్యార్ది అంటూ కితాబిచ్చిన సోదరుడు
లండన్, జూన్ 22: పాప్ స్టార్ రిహానా బ్రదర్ టొర్రీ లీన్ మాట్లాడుతూ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూల్‌గా ఉండే వ్యక్తి మాత్రమే కాదు.. బార్బడోస్‌లో తను స్కూల్లో చదువుకున్న రోజుల్లో చాలా తెలివైన అమ్మాయిగా అభివర్ణించాడు. మేము చాలా కష్టపడి ఈరోజు ఈ స్దాయికి వచ్చామని అన్నాడు. మేము మంచి స్కూల్స్‌లో చదువుకున్నాం, రిహానా మొదటి నుండి మంచి స్టూడెంట్ గుర్తింపు తెచ్చుకుందని 22 సంవత్సరాల వయసు కలిగిన టొర్రీ లీన్ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.
అంతేకాకుండా రిహానాను స్వీయ ప్రేరణ కలిగి ఉన్న ఆమెగా.. వారంలో ఆనందించడానికి ఖచ్చితంగా ఏదో ఒకరోజు సమయం తీసుకోని ఎంజాయ్ చేస్తుందని తెలిపాడు. ఇంట్లో మమ్మీ ఎప్పుడూ తన హోం వర్క్‌ని పూర్తి చేయమని పుష్ చేయదు. రిహానా చాలా క్రమశిక్షణ కలిగి ఉండేది. ఆదివారాలలో నేను, నా స్నేహితులు కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు వెళుతుంటామని అన్నాడు. వీకెండ్స్‌ని సమయాన్ని ఎక్కువగా సినిమాలతో గడిపేస్తామని తెలిపాడు.
సింగర్ రిహానా బాస్కెట్ బాల్ ప్లేయర్ 'జూనియర్ స్మిత్' తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్‌లో రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. 24 సంవత్సరాల వయసు కలిగిన రిహానా ఫ్లోరిడాలో జరిగిన ఓ ఈవెంట్లో కలుసుకోవడం జరిగిందని సమాచారం. వారాంతంలో వీరిద్దరిని చూసిన వారు ఇద్దరూ కలిసి ఏకాంతంగా కొంత సమయం గడిపినట్లు తెలిపారు. గతంలో రిహానా క్రిస్ బ్రౌన్‌తో డేటింగ్ చేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











