హ్యాకింగ్‌కు గురైన పాప్ సింగర్ ట్విట్టర్ ఎకౌంట్
లండన్: సాధారణంగా సెలబ్రిటీల ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్ చేసి వారి ఎకౌంట్ల హ్యాకర్స్ ట్వీట్ చేస్తున్న విషయం ఇటీవల కాలంలో మనం చాలా గుర్తించాం. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి బ్రిటిష్ సింగర్ వచ్చి చేరారు. బ్రిటిష్ పాప్ సింగర్ రీటా ఓరా ట్విట్టర్ ఎకౌంట్‌ని హ్యాక్ చేసిన హ్యాకర్ ఒకడు వేరే సింగర్ హ్యారీ స్టైల్స్‌తో తనకి క్రష్ ఉన్నట్లు ట్వీట్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ పాప్ సింగర్ రీటా ఓరా ట్విట్టర్ ఎకౌంట్‌ని హ్యాక్ చేసిన హ్యాకర్ తన ట్విట్టర్ నుండి వన్ డైరక్షన్ సింగర్ 'హ్యారీ స్టైల్స్'తో తనకు సంబంధం ఉన్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో ట్విట్టర్‌లో తనని ఫాలో అవుతున్న అభిమానులందరికి రీటా ఓరా క్షమాపణలు తెలిపి ఈ పోస్ట్‌ని పోస్ట్ చేసిందని తాను కాదని.. తన ట్విట్టర్ ఎకౌంట్ దొంగతన చేయబడిందని వివరణ ఇచ్చుకుంది.
21 సంవత్సరాల వయసు కలిగిన రీటా ఓరా ట్విట్టర్ ఎకౌంట్ నుండి శనివారం "I wanna be with Harry Styles." అంటూ ట్వీట్ చేయబడింది. ఈ ట్వీట్ చూసిన రీటా ఓరా వెంటనే ఆ ట్వీట్‌ని తొలగించిన తనని ఫాలో అవుతున్న 1.1 మిలియన్ ఫాలోవర్స్‌కి క్షమాపణలను తెలియజేసి .. సమస్య పరిష్కారం అయ్యేవరకూ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ప్రతినిధులకు తన ఎకౌంట్‌ని తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా కోరింది. తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాకింగ్‌కు గురైనదని తిరిగి మళ్లీ తిరిగి కొంత సమయం పడుతుంది.. ధన్యవాదాలంటూ ట్వీట్ చేసింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











