80 ఏళ్ల వయసులో తండ్రులుగా రాబర్డ్ డీ నీరో, అల్ పసినో.. శృంగారంలో తగ్గేదేలే అంటున్న సినీ దిగ్గజాలు
లేటు వయసులో బిడ్డకు జన్మను ప్రసాదించడమనే అందర్నీ ఆశ్చర్యకరమైన వార్తే. అదీ 80 ఏళ్లు దాటిన తర్వాత తండ్రి కాబోతున్నాడనే ఇంకాస్త ఎక్కువ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి వార్తలు సాధారణ వ్యక్తులకు సంబంధించినవైతే.. పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. కానీ అది సినిమా పరిశ్రమలో అయితే ఆ వార్త ప్రపంచాన్ని చుట్టి రావడం సహజంగా కనిపిస్తుంది.
అయితే తాజాగా తమ నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్న హాలీవుడ్ దిగ్గజాలు రాబర్ట్ డీ నీరో, అల్ పసినో ఇద్దరు కూడా 80 ఏళ్ల వయసులో తండ్రి కావడం అంతర్జాతీయ మీడియాలో సంచలనం రేపింది. చర్చనీయాంశంగా మారిన ఆ వార్త వివరాల్లోకి వెళితే..

రాబర్ట్ డీ నీరో గురించి: ప్రపంచ సినిమా రంగంలో రాబర్ట్ డీ నీరో కెరీర్ విషయానికి వస్తే.. గాడ్ ఫాదర్, రేజింగ్ బుల్ సినిమాలు గుర్తుకు వస్తాయి.రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన ఆయన ఘనతను సాధించారు. 80 ఏళ్ల వయసులో కూడా రాబర్ట్ డి నిరో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఎబౌట్ మై ఫాదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని లారా టెర్రసో దర్శకత్వం వహించారు. లెస్లీ బిబ్, అంర్స్ హోల్మ్, డేవిడ్ రాస్చే, కిమ్ కట్ట్రాల్ తదితరులు నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
హాలీవుడ్ సినీ దిగ్గజం రాబర్ట్ డీ నీరో తన 80 పుట్టిన రోజును ఇటీవలే జరుకొన్నారు. అయితే తన 80 ఏట ఆయన ఓ బిడ్డకు జన్మనిచ్చారని మీడియాలో వెల్లడించడం సంచలనంగా మారింది. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని గోప్యంగా ఉంటారు. అయితే తాను నటించిన ఎబౌట్ మై ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తనకు ఏడో సంతానం కలిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఆయన మాటలు వైరల్ అయ్యాయి.

రాబర్ట్ నీరో దాంపత్య జీవితం గురించి: ప్రముఖ నటుడు రాబర్ట్ డి దాంపత్య జీవితం విషయానికి వస్తే.. ఆయను రెండుసార్లు వివాహం చేసుకొన్నారు. ఆయన మొదటి భార్య డిన్నే అబాట్‌కు ఇద్దరు పిల్లలు జన్మించారు. డ్రేనా 51 సంవత్సరాలు, రాఫెల్ 46 సంవత్సరాలు. అలాగే మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో ఇద్దరు పిల్లలను కన్నారు. ఇలియట్‌కు 25 సంవత్సరాలు, హెలెన్‌కు 11 సంవత్సరాలు. ఇక మాజీ ప్రియురాలు టౌకీ స్మిత్‌తో ఇద్దరు కవలలు ఆరోన్, జూలియన్ ఉన్నారు. రాబర్ట్ డి నిరోకు ఒక మనవరాలు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు.

83 సంవత్సరాల వయసులో అల్ పసినో: హాలీవుడ్‌లో సీనియర్ నటుడు అల్ పసినో ఎనిమిది పదులు వయసులో తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసులో అల్ పసినో ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం చర్చనీయాంశమైంది. గత కొద్దికాలంగా నిర్మాత నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్న ఆయన మరో నెల రోజుల్లో ఓ చిన్నారికి తండ్రి కాబోతున్నారు. ఈ వార్త ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నది.

అల్ పసినో వైవాహిక జీవితం: ఆల్ పసినో వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 1988 నుంచి 1989 వరకు జాన్ టర్రంట్‌తో రిలేషన్ కొనసాగించారు. ఆ తర్వాత బెవెర్లీ డీ ఏంజెల్లోతో 1997 నుంచి 2003 వరకు సహ జీవనం చేశారు.ఆ తర్వాత లుసిలా పొలాక్‌తో 2008 నుంచి 2018 వరకు రిలేషన్ కొనసాగించారు. ప్రస్తుతం నూర్ అల్ఫాల్లాతో సహ జీవనం చేస్తున్నారు.

అల్ పసినో కెరీర్ గురించి: అల్ పసినో కెరీర్ విషయానికి వస్తే.. 1969లో మీ నాటలే అనే మూవీతో సినిమా రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత 1972లో ది గాడ్ ఫాదర్ సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. 1974లో ది గాడ్ ఫాదర్ పార్ట్ 2లో నటించారు. ఆ తర్వాత రెవల్యూషన్, సీ ఆఫ్ లవ్, స్కార్ ఫేస్, సెంట్ ఆఫ్ ఏ ఉమెన్, అడ్వకేట్, ది ఇన్‌సైడర్ చిత్రాల్లో నటించారు. తాజాగా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరీష్ మ్యాన్, ది పైరేట్స్ ఆఫ్ సోమాలియా తదితర చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











