twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అవెంజర్స్’ హీరో రెమ్యునరేషన్ ఎన్ని వందల కోట్లంటే.. ఒక్కో హీరోకు ఎన్ని కోట్లంటే!

    |

    ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రంలోని ఎమోషనల్ కంటెంట్, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాను విజయపథం వైపు నడిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఐరన్ మ్యాన్‌గా కీలక పాత్రను పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్ నటనను ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతటి ప్రభావాన్ని చూపిన హీరో రాబర్ట్ రెమ్యునరేషన్ వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో విడుదలైన అవెంజర్స్: ఇన్పినిటీ వార్ సినిమా కోసం ఎంత చెల్లించారంటే...

    భావోద్వేగానికి గురిచేసిన రాబర్ట్ డౌనీ

    భావోద్వేగానికి గురిచేసిన రాబర్ట్ డౌనీ

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం రిలీజైన తర్వాత అందరి నోటా రాబర్ట్ డౌనీ జూనియర్ గురించే వినిపించింది. గతంలో కామిక్ క్యారెక్టర్ యాక్టర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ హీరో అవెంజర్స్: ఎండ్ గేమ్ తర్వాత ప్రేక్షకుడు గుండెలు పగిలే విధంగా భావోద్వేగాన్ని పండించారు. ఈ సూపర్ హీరోగా అవెంజర్స్ కోసం భారీగానే రెమ్యునరేషన్ రాబట్టినట్టు సమాచారం.

    రూ.524 కోట్ల పారితోషికం

    రూ.524 కోట్ల పారితోషికం

    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్‌లో చివరిదైన అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ కోసం రాబర్ట్ డౌనీకి దాదాపు 75 మిలియన్ల డాలర్లను చెల్లించారు. అంటే అక్షరాల రూ.524 కోట్లు అన్నమాట. అంతేకాకుండా గతంలో విడుదలైన అవెంజర్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రతిఫలాన్ని పొందే హక్కులను సొంతం చేసుకొన్నారట.

    ప్రతీ రోజుకు 5 మిలియన్ డాలర్లు

    ప్రతీ రోజుకు 5 మిలియన్ డాలర్లు

    గతంలో స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమాకు పనిచేసే సమయంలో వారానికి మూడు రోజులపాటు పనిచేశారట. అయితే ప్రతీ రోజు 5 మిలియన్ డాలర్లను రెమ్యూనరేషన్‌గా అందుకొన్నారట. ఐరన్ మ్యాన్ సక్సెస్ తర్వాత ప్రతీ సినిమాకు 20 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ అందుకొనే అతికొద్ది మంది హాలీవుడ్ హీరోలలో ఒకడిగా మారారు.

    స్కార్లెట్ జాన్సన్‌ రెమ్యూనరేషన్ ఎంతంటే

    స్కార్లెట్ జాన్సన్‌ రెమ్యూనరేషన్ ఎంతంటే

    అవెంజర్స్‌లో నటించిన క్రిస్ హేమ్స్‌వర్త్, క్రిస్ ఇవాన్స్ మిగితా వారెవరూ రాబర్ట్ డౌనీకి దారిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఈ చిత్రంలో నటించిన స్కార్లెట్ జాన్సన్ మాత్రం ఇన్ఫినిటీ వార్‌ కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు అంటే రూ.139 కోట్ల రెమ్యునరేషన్ అందుకొన్నారు.

    5 రోజుల్లో రూ.8 వేల కోట్లు

    5 రోజుల్లో రూ.8 వేల కోట్లు

    అవెంజర్స్: ఎండ్‌గేమ్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.8 వేల కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రపంచంలో విడుదలైన ప్రతీచోట.. దాదాపు 46 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఇండియాలో ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేసి భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది.

    English summary
    Robert Downey Jr's portrayal of Iron Man in the Marvel franchise has won hearts of critics as well as fans. According to reports the actor was paid around Rs 524 crore for his role in Avengers Infinity War.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X