వందల కోట్లు: సంపాదనలో సినీస్టార్స్ వరల్డ్ రికార్డ్ (ఫోటో ఫీచర్)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ వరుసగా రెండో సారి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన సినిమా స్టార్‌గా రికార్డుల కెక్కారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన హయ్యెస్ట్ పెయిడ్ హాలీవుడ్ యాక్టర్ల జాబితాలో రాబర్డ్ డౌనీ జూనియర్ నెం.1 స్థానం దక్కించుకున్నాడు.
జూన్ 2013 నుండి జూన్ 2014 వరకు రాబర్ట్ డౌనీ జూనియర్ 75 మిలియన్ డాలర్స్(రూ. 451.5 కోట్లు) సంపాదించినట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. గత సంవత్సరం కూడా దాదాపుగా ఇంతే సంపాదనతో రాబర్ట్ డౌనీ జూనియర్ నెం.1 స్థానంలో నిలిచాడు. 'ఐరన్ మ్యాన్' సిరీస్ సినిమాల హీరో అయిన రాబర్ట్ డౌనీ జూనియర్ గడిచిన సంవత్సరంలో హీరోగా ఏ సినిమా చేయక పోయినా....సంపాదన ఏ మాత్రం తగ్గక పోవడం విశేషం.
అది ఎలాగంటే....రాబర్ట్ డౌనీ జూనియర్ హీరోగా సినిమాలేవీ రాక పోయినా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు. దీంతో పాటు గతంలో ఆయన చేసిన సినిమాల ఒప్పందాల ప్రకారం అతనికి ఇంకా అదాయం వచ్చి పడుతూనే ఉంది. రాబర్ట్ డౌనీతో పాటు ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో ఉన్న సినీస్టార్స్ గురించిన వివరాలు స్లైడ్ షోలో....

రాబర్డ్ డౌనీ
రాబర్ట్ డౌనీ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 75 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 451.5 కోట్లు

ద్వేన్ జాన్సన్
మరో బాలివుడ్ నటుడు ద్వేన్ జాన్సన్ ఆదాయం 52 మిలియన్ డాలర్స్. మన లెక్క ప్రకారం రూ. 313 కోట్లు

బ్రాడ్లీ కూపర్
హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ సంపాదన 46 మిలియన్ డాలర్లు. అంటే రూ. 277 కోట్లు

లియోనార్డో డికాప్రియో
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సంపాదన 39 మిలియన్ డాలర్లు. అంటే రూ. 234 కోట్లు.

క్రిస్ హేమ్స్‌వర్త్
మరో హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ సంపాదన 37 మిలియన్ డాలర్లు. అంటే రూ. 222 కోట్లు.

లియామ్ నీసన్
హాలీవుడ్ నటుడు లియామ్ లీసన్ సంపాదన 36 మిలియన్ డాలర్లు. అంటే రూ. 216 కోట్లు.

బెన్ అఫ్లెక్
నటుడు బెన్ అఫ్లెక్ సంపాదన 35 మిలియన్ డాలర్లు. అంటే రూ. 210.7 కోట్లు

క్రిష్టియన్ బేల్
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బేల్ సంపాదన 35 మిలయన్ డాలర్లు. అంటే రూ. 210.7 కోట్లు.

విల్ స్మిత్
మరో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ సంపాదన 32 మిలియన్ డాలర్లు. అంటే రూ. 192 కోట్లు.

మార్క్ వాల్ బెర్గ్
హాలీవుడ్ నటుడు మాక్క్ వాల్ బెర్గ్ సంపాదన 32 మిలియన్ డాలర్లు. అంటే రూ. 192 కోట్లు.


Click it and Unblock the Notifications











