అతను ముద్దు సీన్లలో ఇరగదీయడమే కాదు ముద్దు కూడా బాగా పెడతాడు
రాబర్ట్ పాటిన్ సన్ తనతో నటించేటటువంటి హీరోయిన్లు చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ రాబర్ట్ పాటిన్ సన్ చేసినటువంటి ఘనకార్యం ఏమిటని అనుకుంటున్నారా.. ఏమి లేదండీ తనతోపాటు సినిమాలలో నటించేటటువంటి హీరోయిన్లుకు మనవాడు జీవితంలో మరిచిపోలేనటువంటి గాఢంగా ముద్దులు ఇస్తాడంట. సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో లాకింగ్ లిప్స్ రెండు మూడైన ఉంటాయి. ఇలాంటి లాకింగ్ లిప్స్ మనవాడు హీరోయిన్లుతో బాగా గాఢంగా చేస్తాడని తన కోస్టార్ క్రిస్టనా రిక్కి ఇటీవల అందరి ముందు ఈవిషయాన్ని వెల్లడించింది.
ఇలాగే గతంలో కూడా రీసీ వితర్ స్పూన్ కూడా రాబర్ట్ పాటిన్ సన్ తోతన ముద్దు అనుభవాలను పంచుకున్నారు. ఇక బెల్ అమి కోస్టార్ క్రిస్టనా రిక్కి మాట్లాడుతూ రాబర్ట్ పాటిన్ సన్ మంచి కిస్సర్ అని బిరుదు ఇచ్చేసింది. ఇంతటితో ఆగకుండా రాబర్ట్ పాటిన్ సన్ మంచి మనిషి కూడా, తనతోపాటు సినిమా చేస్తున్నంత సేపు చాలా హాయిగా ఉంది. ఎప్పుడూ సెట్ లోఅందరిని నవ్విస్తూ చాలా సరదాగా ఉంటాడు. రీసీ వితర్ స్పూన్, రాబర్ట్ పాటిన్ సన్ ఇద్దరూ 'వాటర్ ఫర్ ఎలిప్యాంట్స్' అనే సినిమాలో ముద్దు సీన్లు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











