Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
అదరగొడుతున్న సినిమా పోస్టర్..!
ట్విలైట్ సినిమా షూటింగ్ లో ఏర్పడిన వారి పరిచయం ప్రేమగా మారిందని.. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని మీడియా అంతా కొడై కూసినా వీరిద్దరూ మాత్రం అలాంటిదేమీ లేదు..అదంతా పచ్చి అబద్ధం మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని బుకాయిస్తూ వచ్చారు. వీరే న్యూమూన్ జంట రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్. కానీ మీడియా డేగ కన్ను నుండీ తప్పించుకోలేకపోయిన వీరిద్దరూ ఎన్నో సార్లు దొరికీ దోరకనట్ట తప్పించుకున్నారు. మీడియా కన్నుకప్పడం ఇహ మా వల్ల కాదనుకున్నారో ఏమో తామిద్దరం నటించిన ట్విలైట్ రెండవ సీక్వెల్ ఎక్లిప్స్ సినిమా ప్రీమియర్ షోకు జంటగా వచ్చి తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చెయ్యాలని అనుకుంటున్నారట.
ఇక వేసవిలో విడుదల కానున్న ఈ ఎక్లిప్స్ సినిమాకు మంచి క్రేజ్ వుంది. ఇంతకు ముందు వచ్చిన ట్విలైట్, న్యూమూన్ సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ఇటీవలే విడుదలయిన ఈ సినిమా పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.