వారిద్దరి కలయిక అదిరిపోతుందట
హాలీవుడ్ నటి నికోల్ కిద్మాన్ క్రేజీ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ తో ఓ సినిమా చెయ్యనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే ప్రారంభమయిన 'బెల్ అమి' అనే సినిమాలో వీరిద్దరూ కలసి నటించనున్నట్టు తెలిసింది. రాబర్ట్ ఇప్పటికే సినిమాకు పచ్చజెండా ఊపగా, నికోల్ ఇంకా ఈ సినిమాలో నటించడం ఖరారు చెయ్యలేదు. కానీ ఆమె ఈ సినిమాలో ఖచ్చితంగా నటిస్తుందని సినిమా యూనిట్ చెబుతోందని డైలీ టెలీగ్రాఫ్ పత్రిక ఓ వార్తను ప్రచురించింది.
కాగా వీరిద్దరి కలయిక ఖచ్చితంగా ఓ మంచి జంటగా పేరుతెచ్చుకుంటుందని హాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఇటీవలే నికోల్ టామ్ క్రూజ్ తో ఆమె వివాహం ఆమె కెరీర్ కు ఎంతో కలసివచ్చిందని ప్రకటించిన విషయం తెలిసిందే...
నికోల్ కిద్మాన్ హాలీవుడ్ రాబర్ట్ ప్యాటిన్సన్ బెల్ అమి nicole kidman robert pattinson hollywood bel ami


Click it and Unblock the Notifications