కరోనాకి వణికిన బ్యాట్‌మాన్... ప్యాటిన్సన్‌కు సోకిన కోవిడ్19!

సిల్వర్ స్క్రీన్ పై మహామహులైన దుష్ఠశక్తుల్ని సైతం మట్టుబెట్టించే సూపర్ హీరోలు, చివరకు కరోనా ముందు చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ లోని స్టార్ హీరోలను ముప్పుతిప్పలు పెట్టేసిన కోవిడ్ 19, ఇప్పుడు బ్యాట్ మాన్ వరకూ వెళ్లిపోయింది. దీంతో వార్నర్ బ్రదర్స్ సంస్థ షూటింగ్ ను మానుకుని కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ట్విలైట్ సాగా హీరోగా పేరుగాంచిన రాబర్ట్ ప్యాటిన్సన్ ను తొలిసారి సూపర్ హీరోగా చూపించేందుకు కంకణం కట్టుకున్న వార్నర్ బ్రదర్స్, బ్యాట్ మాన్ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కానీ, లాక్ డౌన్ వల్ల షూటింగ్ బ్రేకులు పడగా, ఇటీవలే మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టారు. అయితే ఇంతలోనే షూటింగ్ స్పాట్ లో కరోనా కలకలం మొదలైంది. చిత్ర బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంలో మళ్లీ అర్ధాంతరంగా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది.

Robert pattinson tests positive For COVID 19, Batman shoot stalls

తమ బృందంలో ఒకరికి కోవిడ్ 19 సోకడం వల్ల షూటింగ్ నిలిపివేస్తున్నట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ వ్యక్తి ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక, అనధికార సమాచారం మేరకు బ్యాట్ మాన్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ కే కోవిడ్ 19 సోకిందని తెలుస్తోంది. మరోవైపు తమ బృందంలో కరోనా సోకిన వ్యక్తిని తగు జాగ్రత్తలతో ‌ఐసోలేషన్ లో ఉంచినట్లు మాత్రం వార్నర్ బ్రదర్స్ సంస్థ వెల్లడించింది.

ఇక కొద్దిరోజుల క్రితమే రాబర్డ్ ప్యాటిన్సన్ ను బ్యాట్ మాన్ గా చూపిస్తూ ఓ టీజర్ విడదల చేయగా, జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ప్యాటిన్సన్ త్వరగా కోలుకుని బ్యాట్మాన్ గా దూసుకువస్తాడని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X