Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సెక్యీయస్ట్ మ్యాన్'గా మళ్లీ మూడోసారి కూడా అతనే...!!
ప్రపంచంలో సెక్సీయస్ట్ మ్యాన్ ఎవరూ అంటూ ఇటీవల హాలీవుడ్లో టాప్ 50 మంది సెలబ్రటీలను తీసుకొని ఓ సర్వే నిర్విహించడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా సెక్సీయస్ట్ మ్యాన్ స్దానాన్ని కైవసం చేసుకుంటున్న ట్విలైట్ స్టార్ 'రాబర్ట్ ప్యాటిన్సన్'నే ఈసారి కూడా నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక మొదటి స్దానం కొసం గట్టి పోటీని ఇచ్చిన ట్విలైట్ సినిమాలో తన కోస్టార్ టేలర్ లాట్నర్ రెండవ స్దానంతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది.
గ్లామర్ మ్యాగజైన్ ఈ రేసులో పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్టార్ జానీ డెప్, సాకర్ స్టార్ డేవిడ్ బెకహాం, హై స్కూల్ మ్యూజికల్ యాక్టర్ జాక్ ఎఫ్రాన్లు కూడా రేసులో నిలబడ్డారు. గ్లామర్ మ్యాగజైన్ నిర్విహించిన ఈ పోల్లో మొత్తం 40, 000 మంది పాఠకులు పొల్గోనడం జరిగింది. 40, 000 మంది పాఠకులలో అత్యధిక మంది ట్విలైట్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్కే ఓటు వేయడం జరిగింది.
ఇక గ్లామర్ మ్యాగజైన్ పెట్టినటువంటి ఈ పోల్లో టాప్ 50 స్దానాలలో చివర నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన జార్జీ క్లూనీ, సిల్వర్ ఫాక్స్, జస్టిన్ బైబర్ మొదలగున వారు ఉన్నారు. ఇది ఇలా ఉంటే రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా, క్రిస్టెన్ స్టివార్ట్ హీరోయిన్గా నటించిన 'బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' అనే సినిమా ఈ సంవత్సరం హాలీవుడ్లో విడుదలకు సిద్దంగా ఉన్న పెద్ద సినిమా. గతంలో వీరిద్దరూ కలసి నటించిన ట్వీలైట్ అనే సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.