ఆమెతో సంబంధం ఏంటీ ఛండాలంగా..!!
హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ సెక్సీ తార మేఘన్ ఫాక్స్ తో రొమాన్స్ చేస్తున్నాడని వస్తోన్న వార్తలతో చాలా ఇబ్బంది పడుతున్నాడట. 'హ్యారీపోటర్ అండ్ ది గాబ్లెట్ ఆఫ్ ఫైర్' సినిమా ద్వారా అందరికి సుపరిచయమైన ఈ హీరో తన మీద ఇలాంటి వార్తలు రావడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసాడు. అసలు మ్యాగ్జయిన్స్ లో రూమర్స్ కాలమ్ చదవాలంటేనే భయంగా వుందని చెప్పుకొచ్చాడు.
ఆగస్ట్ నెలలో లాస్ ఎంజిల్స్ లో జరిగిన టీన్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమానికి హాజరయినప్పుడు రాబర్ట్, మేఘనా ఫాక్స్ తో కలసి ఫోటోలకు పోజులివ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలకు బీజం పడింది. ఈ వార్తలను మేఘనా ఫాక్స్ కూడా ఖండించింది. ఇలాంటి గాలి వార్తలకు తాను ప్రాధాన్యం ఇవ్వనని కొట్టిపారేసింది. కానీ రాబర్ట్ మాత్రం ఈ వార్తలను జీర్ణించుకోలేకపోతున్నాడు. బ్రిటీష్ మ్యాగ్జయిన్ 'హీట్' కు ఇచ్చిన ఇంటర్యూలో ఓరి దేవుడా ఇలాంటి వార్తలెలా పుట్టుకొస్తాయి.. అసలు నేను మేఘనా ను ఒకే సారి కలిసాను, అది కూడా కేవలం 2 నిమిషాల పాటు కలసి మాట్లాడుకున్నాం. అంతలోనే ఇలాంటి వార్తలు పుట్టించేసారు.. అయినా నాకు ఆమెతో సంబంధం ఏంటీ ఛండాలంగా అంటూ తెగబాధపడిపోయాడు. పాపం రాబర్ట్ కు ఇంత వరకూ మీడియా దెబ్బ ఎలా వుంటుందో తెలియదు అనుకుంటా. ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్టు చూపించడం మీడియాకు వెన్నతో పెట్టిన విధ్య అని త్వరగా తెలుసుకొని, ఇలాంటి వార్తలను లైట్ తీసుకోమని అతని స్నేహితులు సలహా ఇస్తున్నారట. అయినా అబద్దం అయితే వదిలేయాలి కానీ ఇలా మీడియా మీద పడి ఏడవటం ఎందుకో....!! మీడియా ఇలాంటి వార్తలు రాయకపోతే సినీస్టార్స్ ను జనాలు గుర్తుంచుకోవడం కష్టం కదా...!! ఏమంటారు..??


Click it and Unblock the Notifications











