మరో సారి హాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రం 'రాబిన్ హుడ్'- 'గ్లాడియేటర్' దర్శకుడు రిడ్లే స్కాట్
ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు విజేత రసెల్ క్రోవ్ కథానాయకుడిగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా పోస్టర్ విడుదల ఇటీవలే చోటు చేసుకుంది. 'గ్లాడియేటర్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ పొందిన రసెల్ నటిస్తున్న ఈ చిత్రానికి 'గ్లాడియేటర్', 'బ్లాక్ హాక్ డౌన్' వంటి అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను రూపొందించి, విజువల్ ఎఫెక్టులను రూపొందించడంలో తనకు మరెవరూ సాటి రారని నిరూపించుకున్న దర్శకుడు రిడ్లే స్కాట్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని వున్నాయి.
ట్రెయిలర్ ఇప్పటికే విడుదలయ్యి సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది. కాగా సాంప్రదాయానికి విరుద్ధంగా ట్రెయిలర్ విడుదల తర్వాత ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసారు. ఇక కథ విషయానికి వస్తే రిచర్డ్ కొయిర్ డి లయన్ సైన్యంలోని విల్లుకారుడు శత్రుగూఢచారులను సమర్థవంతంగా ఎదుర్కొని రాబిని హుడ్ గా అనే లెజెండరీ హీరోగా అవతరించడం చుట్టూ కథ తిరుగుతుంది.
రసెల్ క్రోవ్ తో పాటు కేట్ బ్లాంచెట్, మార్క్ స్ట్రాంగ్, స్కాట్ గ్రిమ్స్, కెవిన్ దురండ్ తదితరులు నటించిన ఈ భారీ చిత్రం 2010, మే 14వ తారీఖున విడుదల కానుంది. ఈ సినిమా హాలీవుడ్ చరిత్రలో మరో బ్లాక్ బస్టర్ మూవీ కానుందని అప్పుడే పరిశీలకుల అంచనాలు మొదలయిపోయాయి.


Click it and Unblock the Notifications











