»   » ఆ క్రేజీ ప్రాజెక్టు 'సెక్సీ సీన్లు' నెట్ లో...

ఆ క్రేజీ ప్రాజెక్టు 'సెక్సీ సీన్లు' నెట్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో ట్విలైట్ సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ ట్విలైట్ నవల కథలతో రెండు సినిమాలు విడుదలయితే రెండూ భారీవిజయాలు నమోదు చేసుకున్నవే. కాగా ప్రస్తుతం ఈ వరుసలో వస్తున్న మూడవ సినిమా ఎక్లిప్స్. రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ లు నటిస్తున్న ఈ సినిమాకు వున్న క్రేజ్ ను దృష్టిలో వుంచుకొని దీన్ని సొమ్ము చేసుకోవడానికి కొందరు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెట్ లోకి లీక్ చేసారు.

రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ లు ఘాడంగా ముద్దు పెట్టుకుంటున్న ఈ సెక్సీ సీన్లకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. దీనితో పాటు మరిన్ని సన్నివేశాలు నెట్ లో లీకయ్యాయి. ఈ విషయం తెలిసిన నిర్మాత మాత్రం ఈ సీన్లు ఎవరు లీక్ చేసారా అని పరిశోధన ప్రారంభించారు. ఇకపై ఇలాంటి చర్యలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu