'ఎంగేజ్‌మెంట్ రింగ్' తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్..
పుట్‌బాల్ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి రోనాల్డో. పుట్‌బాల్ కెరియర్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొవడమే కాకుండా, ఎక్కవ మొత్తంలో డబ్బుని సంపాదించి మిలియనీర్స్ జాబితాలో చేరారు. ఎంతటి గొప్పవారైనా అమ్మాయి ప్రేమలో పడాల్సిందే.. పెళ్లి చేసుకొవాల్సిందే అనే సూత్రం ప్రకారం ఆటగాడు రొనాల్డో కూడా స్పోర్ట్ మోడల్ ఐరినా ష్యాక్ ప్రేమలో పడడం జరిగింది. ప్రేమలో పడడమే కాకుండా ఇటీవలే ఈ అమ్మడుతో ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయింది.
ఇదంతా మీకు ఇప్పడు ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల మాడ్రిడ్‌లో జరిగిన గొల్డెన్ బూట్ అవార్డుల కార్యక్రమంలో ఐరినా ష్యాక్ తన ఎంగేజ్ మెంట్ రింగ్‌తో రావడంతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ అవార్డుల కార్యక్రమానికి ఐరినా ష్యాక్ కురుచ దుస్తులతో వచ్చిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదండోయ్ 25 సంవత్సరాల వయసు కలిగిన ఐరినా ష్యాక్ తన ఎడమచేతి మూడవ వ్రేలుకి ధరించిన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇంకా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఖరీదైన ఈ వజ్రాల రింగ్‌ని రొనాల్డో తన ఎంగేజ్ మెంట్ రోజున ఐరినా ష్యాక్ చేతికి తొడగడం జరిగింది. ఇక దీని ధర గనుక తెలుసుకుంటే వావ్ అని అనాల్సిందే. దీని ధర £100,000. ఇక రొనాల్డోకి ఇటీవల స్పానిష్ లా లిగా సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్‌కి గాను ఈ గోల్డెన్ బూట్‌ని ఇవ్వడం జరిగింది. అన్ని యూరోపియన్ లీగ్స్‌లలో 2010-2011వ సంవత్సరానికి గాను రొనాల్డో అత్యుత్తమ ఆటను ప్రదర్శించడం జరిగింది. 40గోల్స్‌ని సాధించి రికార్డు నమోదు చేసిన 'హుగో సాంచెజ్' రికార్డుని సమం చేసినందుకు గాను రొనాల్డోకి గోల్డెన్ బూట్‌తో సత్కరించడం జరిగింది.
ఇటీవలే XTI పుట్ వేర్ సంస్ద మోడల్ ఐరినా ష్యాక్ చేత క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపెయిన్‌లో 25 సంవత్సరాల వయసు కలిగిన ఐరినా ష్యాక్ చేత అర్ద నగ్నంగా తన అందాలను కనిపించే విధంగా స్కింపీ అవుట్ ఫిట్స్ ధరింప చేసి ఫోటో షూట్ నిర్విహంచడం జరిగింది.


Click it and Unblock the Notifications











