బట్టలన్నీ విప్పేసి నిలబడమన్నారు, హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. తప్పని పరిస్థితుల్లో!
Recommended Video

కాస్టింగ్ కౌచ్ ఉందంతాలు ప్రపంచం మొత్తం జరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ నటీమణులు మీటూ క్యాంపైన్ నడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని మీటూ క్యాంపైన్ ద్వారా బయట పెడుతున్నారు. తాజగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరోయిన్ రోసముంద్ పైక్ సంచలన విషయాలు వెల్లడించింది. పైక్ 2002 వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం డై అనదర్ డే చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడిషన్స్ లో భాగంగా పైక్ తనకు ఎదురైన ఘోర అవమానాన్ని బయట పెట్టింది.

బాండ్ హీరో
బాండ్ హీరో పియర్స్ బ్రొస్నాన్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో పైక్ ఉత్సాహంగా ఈ ఆడిషన్స్ కు వెళ్లిందట. అప్పటికి పైక్ కేవలం 21 ఏళ్ళ యువతి మాత్రమే.తాను హాలీవుడ్ లో రాణించాలని భావిస్తున్న తరుణం అది అని పైక్ తెలిపింది.

బట్టలన్నీ విప్పేసి
ఆడిషన్స్ ప్రారంభం అయ్యాయి. నన్ను పిలిచారు. లోదుస్తులతో సహా బట్టలన్నీ విప్పేసి నిలబడమన్నారు. సెక్సీ స్టిల్స్ ఫైనల్ ఆడిషన్స్ కోసం లాస్ ఏంజెల్స్ పంపిస్తామని చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు చెప్పినట్లు చేస్తే పెద్ద చిత్రంలో అవకాశం వస్తుంది. కానీ తాను అలా చేయలేదు అని పైక్ తెలిపింది.

అలా చేస్తానని
బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడను. కాని సెక్సీగా ఉండే దుస్తులు ధరిస్తానని చెప్పాను. తాను రాత్రి సమయంలో ధరించే చిన్నపాటి గౌన్ ని ధరించాను. కానీ అక్కడున్న ఫ్యాషన్ డిజైనర్ నిరాకరించాడు. అతడు తయారు చేసిన మూడు ముక్కల డ్రెస్ ఇచ్చి వేసుకోమన్నాడు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవన్నీ చేశానని పైక్ తెలిపింది.

చివరకు
ఎట్టకేలకు డై అనదర్ డే చిత్రంలో నటించే అవకాశం తనకే వచ్చిందని పైక్ తెలిపింది. ఆ తరువాత సినిమా సెట్ లో ఎప్పుడూ తాను ఇబ్బందిగా ఫీల్ అవలేదు అని తెలిపింది. ఆ చిత్రం పైక్ కు డెబ్యూ మూవీ. ఆ తరువాత హాలీవుడ్ లో పైక్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.


Click it and Unblock the Notifications











