బాడీ సెంట్ యాడ్ కోసం మొత్తం విప్పేసిన స్టార్ హీరోయిన్

By Nageswara Rao

బ్రిటిష్ స్టార్ హీరోయిన్ రోసీ హటిన్గటన్ వైట్లీ 2008లో బర్బరీ యాడ్ క్యాంపెయిన్‌లో చేసినటువంటి నటన ఇప్పటికి కూడా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకోని ఉంది. జనరల్‌గా రోసీ హటిన్గటన్ వైట్లీ హీరోయిన్‌గా కంటే కూడా మోడల్‌గా బాగా ఫేమస్. మోడల్‌గా తన అంద చందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం సంకోచించని నైజం రోసీ హటిన్గటన్ వైట్లీది. అలాంటి అంద చందాలను వదులుకోవడానికి ఇష్టపడని బర్బరీ యాడ్ సంస్ద కోసం మరలా ఈ సంవత్సరం తన అందచందాలను ప్రదర్శించడానికి సిద్దమైంది.

బర్బరీ అనేది ఫేమస్ బాడీ సెంట్. ఈ సెంట్ క్యాంపెయిన్‌లో రోసీ హటిన్గటన్ వైట్లీ అర్దనగ్నంగా తన అందచందాలను ప్రదర్శించింది. ఈ సందర్బంలో రోసీ హటిన్గటన్ వైట్లీ మాట్లాడుతూ బర్బరీ సెంట్‌కు రెండవసారి పని చేయడం చాలా ఆనందించతగ్గ పరిమాణం. నేను మోడల్‌గా ఉన్నప్పుడు బర్బరీ సెంట్ యాడ్‌లో పాల్గోనడం వల్ల నాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ సందర్బంలో నేను బర్బరీ బెస్ట్ బాడీ కాంప్లిమెంట్ అందుకోవడం జరిగింది. 24 సంవత్సరాలు వయసు కలిగినటువంటి రోసీ హటిన్గటన్ వైట్లీ ట్రాన్ప్ ఫార్మర్స్, డార్క్ ఆఫ్ ద మూన్ లాంటి సినిమాలలో నటించడం జరిగింది.

బర్బరీ కంపెనీ ఛీప్ క్రియెటివ్ ఆపీసర్ క్రిస్టోఫర్ బెయిలీ మాట్లాడుతూ బర్బరీ బాడీ ప్రపంచంలో మొత్తం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. బర్బరీ బాడీ‌గా రోసీ హటిన్గటన్ వైట్లీ ఓ ఐకాన్‌గా అవతరించిందని అన్నారు. రోసీ హటిన్గటన్ వైట్లీ అందం, స్టయిలే తనని బర్బరీ మొదటి బాడీ పర్సనాలిటీగా తీసుకునే అవకాశాన్ని కల్పించాయని అన్నారు. ఇక ఈ బ్రాండ్ మార్కెట్లో ఓ సరిక్రొత్త చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. ఇక కొత్తగా విడుదల చేస్తున్నటువంటి ఈ సెంట్ సెప్టెంబర్ 1న 150 దేశాలలో హాల్ చల్ చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X